ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TRAI: సర్వీస్ ఆగితే యూజర్లకు పరిహారం చెల్లించాల్సిందే

ABN, Publish Date - Aug 07 , 2024 | 04:04 PM

ఇటివల కాలంలో అనేక ప్రాంతాల్లో ఫోన్లలో నెట్‌వర్క్ లేకపోవడంతో వినియోగదారులు(customers) చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో టెలికాం కంపెనీలు(Telecom operators) మళ్లీ ఆ సమస్యను పరిష్కరించే వరకు కస్టమర్లు ఇబ్బందులు పడేవారు. కానీ ఇకపై అలా జరిగితే ఊరుకునేది లేదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పష్టం చేసింది.

trai

ఇటివల కాలంలో అనేక ప్రాంతాల్లో ఫోన్లలో నెట్‌వర్క్ లేకపోవడంతో వినియోగదారులు(customers) చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో టెలికాం కంపెనీలు(Telecom operators) మళ్లీ ఆ సమస్యను పరిష్కరించే వరకు కస్టమర్లు ఇబ్బందులు పడేవారు. కానీ ఇకపై అలా జరిగితే ఊరుకునేది లేదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటివల ట్రాయ్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సమయం కస్టమర్ల సేవలకు అంతరాయం కలిగితే టెలికాం కంపెనీలు వినియోగదారులకు పరిహారం చెల్లించే నిబంధనను తీసుకొచ్చింది.


జరిమానా పెంపు

ఆ క్రమంలో కొత్త నిబంధనల(new rules) ప్రకారం నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైన ఆయా కంపెనీలు చెల్లించాల్సిన జరిమానా మొత్తాన్ని రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచింది. ఈ కొత్త నిబంధనలు ఆరు నెలల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ రూల్స్ ప్రకారం స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ (వైర్‌లైన్, వైర్‌లెస్), బ్రాడ్‌బ్యాండ్ (వైర్‌లైన్, వైర్‌లెస్) సేవల ప్రకారం వివిధ ప్రమాణాల ఉల్లంఘనలకు రూ. 1 లక్ష, రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల వరకు జరిమానాలు ఉంటాయని ప్రకటించింది. కొత్త ప్రమాణాలు ప్రాథమిక సెల్యులార్ మొబైల్ సేవలు, బ్రాడ్‌ బ్యాండ్ సేవలు, బ్రాడ్‌ బ్యాండ్ వైర్‌లెస్ సేవల నాణ్యతపై మూడు వేర్వేరు విధాలుగా ఉంటాయని ట్రాయ్(trai) తెలిపింది.


అంతరాయం ఏర్పడితే

ఇకపై జిల్లా పరిధిలో కస్టమర్లకు(customers network) నెట్‌వర్క్ అంతరాయం ఏర్పడితే టెలికాం ఆపరేటర్లు పోస్ట్‌పెయిడ్ యూజర్లకు ఛార్జీల రాయితీలను అందించాలి. ప్రీపెయిడ్ కస్టమర్లకు కనెక్షన్ చెల్లుబాటును పొడిగించాలి. ఏదైనా క్లిష్టమైన నెట్‌వర్క్ అంతరాయం 24 గంటల కంటే ఎక్కువ కాలం కొనసాగితే సర్వీస్ ఆపరేటర్ తదుపరి బిల్లింగ్ సైకిల్‌లో తగ్గింపు ఇవ్వాలని TRAI ఆదేశించింది. రెగ్యులేటర్ ఛార్జీల తగ్గింపు లేదా చెల్లుబాటు పొడిగింపును లెక్కించడానికి క్యాలెండర్ రోజులో 12 గంటల కంటే ఎక్కువ నెట్‌వర్క్ అంతరాయాన్ని పూర్తి రోజుగా పరిగణిస్తారు.

ప్రకృతి వైపరీత్యాల

ఆ క్రమంలో సర్వీస్‌ను సరిచేయడానికి టెలికాం ఆపరేటర్లకు ఒక వారం సమయం ఇవ్వబడుతుంది. అయితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా టెలికమ్యూనికేషన్ సేవలు అంతరాయం కలిగితే ఈ ఉపశమనం అందుబాటులో ఉండదనే విషయం కస్టమర్లు గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో కస్టమర్లు పొందవలసిన సేవా నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు జారీ చేసినట్లు ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లాహోటి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

Alert: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో ఉపశమనం.. ఎప్పటివరకంటే


Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 07 , 2024 | 04:07 PM

Advertising
Advertising
<