ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Budget 2024: ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగింది.. నిర్మలా సీతారామన్..

ABN, Publish Date - Feb 01 , 2024 | 02:28 PM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందన్నారు. గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయని చెప్పారు. దేశ ప్రజలు భవిష్యత్తు వైపు ఆశగా, ఆశావాదంతో చూస్తున్నారన్న ఆమె.. ప్రజల ఆశీర్వాదంతో 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మంత్రంతో దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని గుర్తు చేసుకున్నారు. ఆ సవాళ్లను సీరియస్‌గా తీసుకున్న మోదీ ప్రభుత్వం.. వాటిని సమర్థవంతంగా అధిగమించిందని వెల్లడించారు.

మా ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. అందరికీ ఇల్లు, ఇంటింటికి నీరు, బ్యాంకు ఖాతా, ఆర్థిక సేవలు అందిస్తున్నాం. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాం. తద్వారా ఆహార సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాం. రైతులకు మద్దతు ధర పెంచాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేశాం. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించాం. పేదలు, మహిళలు, యువత, రైతులపై ప్రత్యేక దృష్టి సారించాం. అందరినీ కలుపుకొని సమ్మిళిత అభివృద్ధికి కృషి కొనసాగుతోంది.

- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 01 , 2024 | 02:28 PM

Advertising
Advertising