మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Budget 2024: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. మధ్యతరగతిపై బడ్జెట్ లో వరాల జల్లు..

ABN, Publish Date - Feb 01 , 2024 | 01:00 PM

ఎన్నికల ఏడాది సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. దేశంలో సౌరశక్తిని ప్రోత్సహిస్తామని చెప్పిన ఆమె..

Budget 2024: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. మధ్యతరగతిపై బడ్జెట్ లో వరాల జల్లు..

ఎన్నికల ఏడాది సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. దేశంలో సౌరశక్తిని ప్రోత్సహిస్తామని చెప్పిన ఆమె.. ఖరీదుగా మారిన విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోని కోటి ఇళ్లకు సోలార్ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అంతే కాకుండా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని స్పష్టం చేశారు. రూఫ్ టాప్ సోలార్ పథకం కింద లబ్ధిదారులకు ఈ మేరకు సహాయం చేస్తామని ప్రకటించారు. దేశంలో విద్యుత్ సమస్యను ఎదుర్కోవడానికి ఇది చాలా సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులకు ఏటా రూ. 15వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

దేశంలో మరిన్ని వైద్య కళాశాలలకు అనుమతి ఇస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఆశా వర్కర్లందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ ఆసియా కారిడార్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి గేమ్‌ ఛేంజర్‌గా మారిందని నిర్మలా సీతారామన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు బాగా పెరుగుతున్నాయి. కానీ భారత్ లో మాత్రం ద్రవ్యోల్బణం పెరుగుదలను కట్టడి చేశామని స్పష్టం చేశారు.


వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లు మంజూరు చేస్తాం. స్కిల్ ఇండియా మిషన్ 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చింది. 54 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించింది. 3 వేల కొత్త ఐటీఐలను స్థాపించింది. పెద్ద సంఖ్యలో సంస్థాగత ఉన్నత విద్యాసంస్థలతో పాటు 390 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశాం. వచ్చే ఐదేళ్ల కాలం అభివృద్ధికి మారుపేరుగా భారత్ మారుతుంది.

- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 01 , 2024 | 01:03 PM

Advertising
Advertising