ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vespa 946 Dragon Edition: ఈ స్కూటర్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే.. ఏకంగా కారునే కొనొచ్చు..!

ABN, Publish Date - Jul 02 , 2024 | 11:08 AM

Vespa 946 Dragon Edition: ఆటోమొబైల్ రంగంలో ఆయా కంపెనీల మధ్య పోటీ తీవ్రతరం అవుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుణంగా.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి మంచి మంచి ఫీచర్లతో వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. తాజాగా ఇటాలియన్ మోటార్ కంపెనీ పియాజియో గ్రూప్‌ సరికొత్త వెస్పా స్కూటర్‌ను విడుదల చేసింది.

Vespa 946 Dragon Edition

Vespa 946 Dragon Edition: ఆటోమొబైల్ రంగంలో ఆయా కంపెనీల మధ్య పోటీ తీవ్రతరం అవుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుణంగా.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి మంచి మంచి ఫీచర్లతో వాహనాలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. తాజాగా ఇటాలియన్ మోటార్ కంపెనీ పియాజియో గ్రూప్‌ సరికొత్త వెస్పా స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర ఏకంగా కారును మించి ఉంది. అవును, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా థార్‌ను సైతం ఈ స్కూటర్‌కు చేసే ఖర్చుతో కొనుగోలు చేయొచ్చు. వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్‌ను విడుదల చేసింది కంపెనీ. మరి ఈ స్కూటర్ ధర ఎంతో ఓసారి చూద్దాం..


భారత మార్కెట్‌లో వినియోగదారుల కోసం వెస్పా సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. దీన ధర ఇండియన్ మార్కెట్‌లో రూ. 14 లక్షల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం. ఈ స్కూటర్ పేరు వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్. ఇది హాంకాంగ్ లూనార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ డే నుండి ప్రేరణ పొందిన పరిమిత ఎడిషన్ స్కూటర్. ఈ స్కూటర్‌ను ప్రపంచవ్యాప్తంగా 1888 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే భారత మార్కెట్లో ఎన్ని యూనిట్లు విక్రయించనున్నారో కంపెనీ ప్రకటించలేదు.


వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్ ఫీచర్స్..

వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్‌లో.. ముందు, వెనుక 12 అంగుళాల చక్రాలు, 220 mm డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 150 సిసి ఎయిర్ కూల్డ్ ఇంజన్ 12.7బిహెచ్‌పి పవర్, 12.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ వెస్పా స్కూటర్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ గోల్డ్ కలర్‌, గ్రీన్ కలర్ రంగులో డ్రాగన్‌ ఉంటుంది. ఈ స్కూటర్ స్టీల్ ప్లేట్‌ మోనోకోక్ ఫ్రేమ్‌తో తయారు చేశారు.

వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్ ధర..

కంపెనీ ఈ వెస్పా స్కూటర్ ధరను రూ.14.28 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. కంపెనీ నుండి ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు పరిమిత ఎడిషన్ వెస్పా డ్రాగన్ వర్సిటీ జాకెట్ కూడా ఇవ్వబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పియాజియో మోటోప్లెక్స్ షోరూమ్‌లలో వినియోగదారుల కోసం ఈ స్కూటర్ బుకింగ్ ప్రారంభమైంది.


హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా థార్ ధర..

హ్యుందాయ్ SUV క్రెటా బేస్ వేరియంట్ ధర రూ. 10,99,900 (ఎక్స్ షోరూమ్). మహీంద్రా థార్ ప్రారంభ ధర రూ. 11,34,999 (ఎక్స్ షోరూమ్). అంటే వెస్పా స్కూటర్ ధరతో క్రెటా, థార్ బేస్ వేరియంట్‌లను కొనుగోలు చేయొచ్చు.

For More Business News and Telugu News..

Updated Date - Jul 02 , 2024 | 11:08 AM

Advertising
Advertising