Vodafone Idea: వొడాఫోన్ ఐడియా ఎఫ్‌పీఓ..రూ.18 వేల కోట్ల సమీకరణే లక్ష్యం
ABN, Publish Date - Apr 12 , 2024 | 10:37 AM
వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) లిమిటెడ్ శుక్రవారం (ఏప్రిల్ 12) 18,000 కోట్ల రూపాయల విలువైన ఎఫ్‌పీఓను ప్రకటించింది. సమాచారం ప్రకారం ఈ FPO ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు సాధారణ పెట్టుబడిదారులకు తెరిచి ఉంటుంది. అయితే అసలు ఎఫ్‌పీఓ అంటే ఏంటో ఇప్పుడు చుద్దాం. FPO అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. లిస్టెడ్ కంపెనీ నిధులను సేకరించడానికి FPO ద్వారా సెకండరీ మార్కెట్‌లో కొత్త షేర్లను జారీ చేస్తుంది.

IPO తరహాలో పెట్టుబడిదారులు FPO కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. FPO ప్రైస్ బ్యాండ్‌ను కంపెనీ నిర్ణయిస్తుంది. ఆ క్రమంలో జారీ చేయవలసిన షేర్ల సంఖ్యను కూడా చెబుతుంది. FPO అనేది నిర్ణీత కాలానికి మాత్రమే ఉంటుంది. FPO షేర్లను స్వీకరించిన తర్వాత, ఈ షేర్ల కొనుగోలు, అమ్మకం నిర్ణీత తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
అయితే ఈ ఆఫర్ ద్వారా వొడాఫోన్ ఐడియా రూ.18 వేల కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తోంది. FPO ప్రైస్ బ్యాండ్ రూ.10 నుంచి రూ.11గా నిర్ణయించబడింది. దీని లాట్ పరిమాణం 1298 షేర్లు. IPOలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.14,278 అవసరం. ఫిబ్రవరిలోనే ఈక్విటీ డెట్ ద్వారా మొత్తం రూ.45,000 కోట్లను సమీకరించే ప్రణాళికను కంపెనీ ప్రకటించింది. దీని కింద కంపెనీ ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్ రూట్ ద్వారా రూ.20 వేల కోట్లను సమీకరించనుంది.
ఈ ప్రతిపాదనను షేర్ హోల్డర్లు గత వారం మెజారిటీతో ఆమోదించారు. మిగిలిన మొత్తాన్ని అప్పుల నుంచి సేకరించబడుతుంది. దీని కోసం కంపెనీ రుణదాతలతో మాట్లాడుతోంది. ఈక్విటీ ద్వారా నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత దేశీయ రుణదాతలు అదనపు డెట్ ఫండింగ్‌కు హామీ ఇచ్చారని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.
ఇది కూడా చదవండి:
SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి
Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం
Updated Date - Apr 12 , 2024 | 10:39 AM