ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Savings Account: మీ సేవింగ్స్ ఖాతాలో గరిష్టంగా ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు..

ABN, Publish Date - Dec 14 , 2024 | 06:23 PM

మీరు బ్యాంక్ సేవింగ్ ఖాతా కల్గి ఉన్నారా. అయితే ఈ వార్త తప్పక చదవాల్సిందే. ఎందుకంటే సేవింగ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంచుకోవచ్చో, గరిష్టంగా ఎంత డిపాజిట్ చేసుకోవాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

savings account update

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా అవసరం. అన్ని ప్రభుత్వ పథకాలతోపాటు ఇతర లావాదేవీల కోసం కూడా బ్యాంకు ఖాతాను అనేక మంది కలిగి ఉంటున్నారు. అయితే ఇటివల డిజిటల్ లావాదేవీలు పెరిగిన తర్వాత బ్యాంకు డిపాజిట్లు తగ్గాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో సేవింగ్ అకౌంట్ తీసుకున్న తర్వాత ఎంత బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి, ఎలాంటి రూల్స్ పాటించాలనే విషయం అనేక మందికి తెలియదు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


మీ ఖాతాలో ఎంత డబ్బు

భారతదేశంలో బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఎలాంటి పరిమితి లేదు. అందుకే అనేక మందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. కానీ నిబంధనల ప్రకారం జీరో బ్యాలెన్స్ ఖాతాలు మినహా అన్ని ఖాతాలలో కనీస బ్యాలెన్స్ నిర్వహించడం తప్పనిసరి. లేకుంటే బ్యాంకు మీ ఖాతాల నుంచి పెనాల్టీని వసూలు చేస్తుంది. కానీ సేవింగ్ ఖాతాల విషయంలో మాత్రం అలా ఉండదు. నిబంధనల ప్రకారం మీరు మీ సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బునైనా ఉంచుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి పరిమితి ఉండదు. అయితే మీ ఖాతాలో జమ చేసిన మొత్తం ఎక్కువై అది ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే మాత్రం, ఆ ఆదాయ మొత్తం గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది.


ఒక రోజులో ఎంత డిపాజిట్

దీంతోపాటు బ్యాంకు శాఖకు వెళ్లి నగదు డిపాజిట్ చేసే విషయంలో, నగదు ఉపసంహరించుకునే విషయంలో కూడా పరిమితి ఉంటుంది. చెక్కు లేదా ఆన్‌లైన్ ద్వారా మీరు మీ సేవింగ్స్ ఖాతాలో వెయ్యి, లక్ష, కోటి వరకు ఏంతైనా జమ చేసుకోవచ్చు. కానీ రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును బ్యాంకులో డిపాజిట్ చేస్తే, దాంతో పాటు పాన్ నంబర్ కూడా తెలపాలి.

అంటే ఈ లెక్కన మీరు ఒక రోజులో రూ. 1 లక్ష వరకు నగదు డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే మీరు మీ ఖాతాలో క్రమం తప్పకుండా నగదు జమ చేయకపోతే, ఈ పరిమితి రూ. 2.50 లక్షల వరకు చేరుతుంది. ఇది కాకుండా ఒక వ్యక్తి తన ఖాతాలో ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 10 లక్షల వరకు జమ చేసుకోవచ్చు. ఈ పరిమితి పన్ను చెల్లింపుదారులకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలకు వర్తిస్తుంది.


10 లక్షలకు పైగా ఉన్న డిపాజిట్లపై

ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, ఆ బ్యాంకు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఆదాయం వివరాలను ప్రకటించాలి. ఆ వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఆ మొత్తం గురించి సరైన సమాచారం ఇవ్వలేకపోతే, అతనిపై ఆదాయపు పన్ను శాఖ విచారణ చేయవచ్చు. పట్టుబడితే భారీ జరిమానా కూడా విధిస్తారు.

ఆ వ్యక్తి ఆదాయ మొత్తం గురించి సరైన వివరాలను వెల్లడించకపోతే, డిపాజిట్ మొత్తంపై 60 శాతం పన్ను, 25 శాతం సర్‌ఛార్జ్, 4 శాతం సెస్ విధించే అవకాశం ఉంది. అంటే మీరు రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయలేరని దీనర్థం కాదు. మీ వద్ద ఈ ఆదాయానికి సంబంధించిన రుజువు ఉంటే, మీరు ఎలాంటి చింత లేకుండా నగదు డిపాజిట్ చేసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Gold Investments: భారీగా తగ్గిన బంగారం ధర.. పెట్టుబడి చేయాలా వద్దా..

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..


Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 14 , 2024 | 06:24 PM