Share News

World Bank: 2024లో భారత్ వృద్ధి గురించి ప్రపంచ బ్యాంకు కీలక ప్రకటన

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:39 AM

భారత ఆర్థిక వ్యవస్థకు(Indias economy) మంచి రోజులోచ్చాయా? అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా 2024లో భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా(forecasts) వేసింది. ప్రపంచ బ్యాంకు(World Bank) ఇంతకుముందు ఈ అంచనాను 6.3 వద్ద ఉంచడం విశేషం. అది ఇప్పుడు ఏకంగా 7.5కి పెంచింది.

World Bank: 2024లో భారత్ వృద్ధి గురించి ప్రపంచ బ్యాంకు కీలక ప్రకటన

భారత ఆర్థిక వ్యవస్థకు(Indias economy) మంచి రోజులోచ్చాయా? అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా 2024లో భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా(forecasts) వేసింది. ప్రపంచ బ్యాంకు(World Bank) ఇంతకుముందు ఈ అంచనాను 6.3 వద్ద ఉంచడం విశేషం. అది ఇప్పుడు ఏకంగా 7.5కి పెంచింది. గతంలో అంచనా వేసిన దానికంటే ఇది 1.2 శాతం ఎక్కువ. మిడ్ టర్మ్ తర్వాత మళ్లీ 6.6 శాతానికి రావచ్చని తెలిపింది. భారతదేశ(bharat) వృద్ధి రేటులో ప్రధానంగా సేవా రంగం, పారిశ్రామిక అభివృద్ధి నుంచి వస్తుందని చెప్పింది. మరోవైపు మొత్తం దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన అంచనాలను కూడా ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఈసారి రూ.లక్ష కోట్ల ఐపీఓలు!


ఈ క్రమంలో దక్షిణాసియా(South Asia)లో వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని తెలిపింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల ధోరణులు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అంచనాలను పెంచినట్లు తెలుస్తోంది. అంతేకాదు భారత్ వేగవంతమైన వృద్ధి రేటు కారణంగా పాకిస్థాన్, శ్రీలంక ఆర్థిక వ్యవస్థల్లో మెరుగుదల ఉంటుందని, ఇది దక్షిణాసియా(South Asia) దేశాల మొత్తం వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ప్రపంచ బ్యాంక్ మంగళవారం దక్షిణాసియా అభివృద్ధిపై తాజా అప్‌డేట్‌ను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రానున్న రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి దక్షిణాసియా ప్రాంతంలోనే ఉంటుందని తెలిపింది.

2025 సంవత్సరంలో కూడా దక్షిణాసియా దేశాల మొత్తం వృద్ధి రేటు 6.1 శాతంగా అంచనా వేయబడింది. మరోవైపు 2024-25 ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్(bangladesh) వృద్ధి రేటు 5.7 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేసింది. మరో దక్షిణాసియా దేశమైన పాకిస్థాన్(pakistan) ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పింది. ఈ క్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ వృద్ధి రేటు 2.3 శాతంగా ఉండవచ్చని వెల్లడించింది. శ్రీలంక(srilanka)లో 2025లో వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంటుందని తెలిపింది. శ్రీలంకలో పర్యాటకం, విదేశాల నుంచి వచ్చే డబ్బు పెరిగే సంకేతాలు ఉన్నాయని చెప్పింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

Updated Date - Apr 03 , 2024 | 11:45 AM