ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Alert: ఈ సేవింగ్ ఖాతాలపై మే 1 నుంచి ఛార్జీలు..ఈ కనీస మొత్తం లేకపోతే

ABN, Publish Date - Apr 19 , 2024 | 04:21 PM

మీకు యెస్ బ్యాంక్(YES Bank), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) సేవింగ్ ఖాతాలు(savings accounts) ఉన్నాయా అయితే జాగ్రత్త. ఎందుకంటే మే 1 నుంచి సేవింగ్స్ ఖాతాలపై సర్వీస్ ఛార్జీలను మార్చుతున్నారు. దీంతోపాటు ఎంపిక చేసిన ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. యెస్ బ్యాంక్(YES Bank) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం వివిధ రకాల పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (AMB) అవసరాలను సవరించారు.

YES Bank and ICICI Bank to adjust service charges

మీకు యెస్ బ్యాంక్(YES Bank), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) సేవింగ్ ఖాతాలు(savings accounts) ఉన్నాయా అయితే జాగ్రత్త. ఎందుకంటే మే 1 నుంచి సేవింగ్స్ ఖాతాలపై సర్వీస్ ఛార్జీలను మార్చుతున్నారు. దీంతోపాటు ఎంపిక చేసిన ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. యెస్ బ్యాంక్(YES Bank) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం వివిధ రకాల పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (AMB) అవసరాలను సవరించారు. సేవింగ్స్ అకౌంట్ ప్రో మ్యాక్స్‌కు రూ. 50,000 AMB అవసరం, గరిష్ట ఛార్జీ రూ. 1,000కి పరిమితం చేశారు. సేవింగ్స్ ఖాతా ప్రో ప్లస్, యెస్ బ్యాంక్ ఎసెన్స్ SA, యెస్ రెస్పెక్ట్ SA కోసం గరిష్టంగా రూ.750 ఛార్జీ కాగా, AMBని రూ. 25,000గా పేర్కొన్నారు.


సేవింగ్స్ ఖాతా PRO కోసం, రూ. 10,000 AMB తప్పనిసరి చేస్తూ గరిష్ట ఛార్జీ(charges) రూ. 750 అని ప్రకటించారు. ఇక సేవింగ్ వాల్యూ, కిసాన్ SA కోసం రూ. 5,000 AMB అవసరమని అన్నారు. మరోవైపు యెస్ బ్యాంక్ పలు కొత్త ఖాతా ఓపెనింగ్‌లను నిలిపివేస్తుంది. వాటిలో సేవింగ్స్ ఎక్స్‌క్లూజివ్, సేవింగ్స్ అడ్వాంటేజ్, యెస్ బ్యాంక్ సేవింగ్స్ సెలెక్ట్ సహా నిర్దిష్ట కస్టమర్ సెగ్మెంట్ల కోసం రూపొందించబడిన అనేక ఇతర ఖాతాలు కూడా ఉన్నాయి.


ICICI బ్యాంక్

ఇక ICICI బ్యాంక్ ఖాతాల విషయానికి వస్తే కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ (MAB), నగదు లావాదేవీల ఛార్జీలు, ATM ఇంటర్‌చేంజ్ ఛార్జీలు సహా ఇతర రకాల బ్యాంకింగ్ సేవలను మే 1 నుంచి మార్చుతున్నారు. ఈ క్రమంలో

డెబిట్ కార్డ్ వార్షిక రుసుము: సంవత్సరానికి రూ. 200. (గ్రామీణ ప్రాంతాలకు సంవత్సరానికి రూ. 99)గా మార్పు

చెక్ బుక్: ఒక సంవత్సరంలో 25 చెక్ లీఫ్‌లకు సున్నా. ఆ తర్వాత ఒక్కో లీఫ్‌కు రూ.4

IMPS లావాదేవీలు: బ్యాంకు లావాదేవీ మొత్తం ఆధారంగా టైర్డ్ ఛార్జీని విధిస్తాయి. ఇది లావాదేవీ విలువపై ఆధారపడి ఒక్కో లావాదేవీకి రూ. 2.50 నుంచి రూ. 15 వరకు ఉంటుంది.

నగదు లావాదేవీల ఛార్జీలు: ICICI బ్యాంక్ థర్డ్ పార్టీ లావాదేవీలతో సహా దేశీయ, నాన్-డొమెస్టిక్ బ్రాంచ్‌లలో లావాదేవీలకు ఛార్జీలను సర్దుబాటు చేస్తుంది

మరోవైపు అడ్వాంటేజ్ ఉమెన్ సేవింగ్స్ అకౌంట్, ప్రివిలేజ్ అకౌంట్స్ అడ్వాంటేజ్ ఉమెన్ సేవింగ్స్ అకౌంట్, అసెట్ లింక్డ్ సేవింగ్స్ అకౌంట్, ఆరా సేవింగ్స్ అకౌంట్ మొదలైన అనేక ఖాతాలను బ్యాంక్ నిలివేస్తుంది.


ఇది కూడా చదవండి:

Ekagrah Rohan: 5 నెలల బుడ్డోడు, రూ. 4.2 కోట్లు దక్కించుకున్నాడు.. ఎలాగంటే


Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 19 , 2024 | 04:23 PM

Advertising
Advertising