YouTube: యూట్యూబ్ డౌన్.. పనిచేయని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్.. ఎంతసేపంటే..?
ABN, Publish Date - Feb 27 , 2024 | 04:45 PM
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ స్తంభించిపోయింది. మంగళవారం మధ్యాహ్న 3 గంటల సమయంలో 20 నిమిషాల పాటు పనిచేయలేదు. ఈ విషయాన్ని యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఏబీఎన్ ఇంటర్నెట్: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ (YouTube) స్తంభించిపోయింది. మంగళవారం నాడు మధ్యాహ్న 3 గంటల సమయంలో 20 నిమిషాల పాటు పనిచేయలేదు. ఈ విషయాన్ని యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూట్యూబ్ పనిచేయలేదని వంద మంది కామెంట్ రాశారు. యూట్యూబ్ (YouTube) పనిచేయలేదని ఇంటర్నెట్ సమస్యలకు సంబంధించి పరిష్కారం కనుగొనే డౌన్ డిటెక్టర్ నిర్ధారించింది.
80 శాతం మంది
‘యూట్యూబ్‌లో (YouTube) 80 శాతం మంది వీడియోలు చూడటంలో ఇబ్బంది పడ్డారు. మరికొందరు వీడియోలు అప్ లోడ్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. యూట్యూబ్‌లో (YouTube) అంతరాయం భారతదేశంలో ఏర్పడిందా..? మిగతా దేశాల్లో వచ్చిందానే అంశానికి సంబంధించి మాత్రం స్పష్టత లేదు అని’ డౌన్ డిటెక్టర్ పేర్కొంది.
అప్ లోడ్ చేయడలో సమస్య
యూట్యూబ్‌లో వీడియోలు అప్ లోడ్ చేయడంలో సమస్య ఏర్పడిందని కొందరు యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యూట్యూబ్ (YouTube) సర్వర్ డౌన్ అయ్యిందా.? ఇతర సమస్యలు ఉన్నాయా..? స్పష్టత ఇవ్వండి. తాను లైవ్, షార్ట్స్ అప్ లోడ్ చేయాల్సి ఉంది. తన వైటీ స్టూడియోలో ఏమీ కనిపించడం లేదు. యూట్యూబ్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. యూట్యూబ్ డౌన్‌కు సంబంధించి ఇప్పటివరకు యాజమాన్యం మాత్రం ప్రకటన చేయలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 27 , 2024 | 04:47 PM