Deepinder Goyal: బిలియనీర్ల జాబితాలోకి జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్
ABN, Publish Date - Jul 15 , 2024 | 01:23 PM
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం జోమాటో వ్యవస్థాపకుడు(Zomato founder), సీఈఓ దీపిందర్ గోయల్(Deepinder Goyal) ఈరోజు బిలియనీర్ల క్లబ్(billionaire club)లో చేరారు. జొమాటోలో దీపిందర్ గోయల్ వాటా 1 బిలియన్ డాలర్లు దాటడంతో ఈ ఘనతను సాధించారు.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం జోమాటో వ్యవస్థాపకుడు(Zomato founder), సీఈఓ దీపిందర్ గోయల్(Deepinder Goyal) ఈరోజు బిలియనీర్ల క్లబ్(billionaire club)లో చేరారు. జొమాటోలో దీపిందర్ గోయల్ వాటా 1 బిలియన్ డాలర్లు దాటడంతో ఈ ఘనతను సాధించారు. జొమాటో షేర్లు పెరగడమే దీనికి కారణం. గత కొన్ని నెలలుగా Zomato షేర్లలో భారీగా పెరుగుదల కనిపించింది. సోమవారం ఈ కంపెనీ షేర్లు రూ. 232 వద్ద 52 వారాల రికార్డు స్థాయిని తాకాయి.
ఈ క్రమంలో గత ఏడాది కాలంలో జోమాటో షేర్లు(shares) దాదాపు 190 శాతం రాబడిని ఇచ్చాయి. దీంతో దీపిందర్ గోయల్ బిలియనీర్ అయ్యారు. జొమాటోలో దీపిందర్ గోయల్ దాదాపు 36.94 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఈ విధంగా ఒక డాలర్‌కు రూ. 83.55 మారకం రేటును పరిశీలిస్తే ఆ షేర్ల మొత్తం విలువ 1.02 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
రుసుం పెంపు
ఇటీవల ఢిల్లీ(delhi), బెంగళూరులో జొమాటో ప్లాట్‌ఫారమ్ రుసుమును 6 రూపాయలకు పెంచుతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు ఏప్రిల్‌లోనే కంపెనీ రూ.4 నుంచి రూ.5కి పెంచింది. జొమాటో(Zomato) గత ఏడాది ఆగస్టులోనే రూ.2 ప్లాట్‌ఫారమ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత దాన్ని రూ.3కి పెంచారు. నూతన సంవత్సర పండుగ సందర్భంగా రికార్డ్ ఫుడ్ ఆర్డర్‌లతో జనవరిలో కీలక మార్కెట్‌లలో తప్పనిసరి ప్లాట్‌ఫారమ్ రుసుమును రూ. 3 నుంచి రూ.4కి పెంచారు.
ఫీజులు పెంచి బిలియనీర్?
ఆగస్ట్ నెలలో ప్లాట్‌ఫారమ్ ఫీజులను పెంచిన తర్వాత Zomato లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. ఆ క్రమంలో సెప్టెంబరు త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.36 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఆ తర్వాత డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.138 కోట్లకు చేరుకుంది. అయితే ప్లాట్‌ఫారమ్ ఫీజులను పెంచిన తర్వాత కంపెనీ లాభాలు పెరిగాయని చెప్పవచ్చు. ఫీజులను పెంచడం ద్వారా సంస్థ లాభదాయకంగా మారింది.
ఏటా 85 కోట్లు
Zomato వ్యాపారం గురించి మాట్లాడితే కంపెనీ ప్రతి సంవత్సరం 85-90 కోట్ల ఆర్డర్‌లను అందిస్తుంది. ఈ విధంగా చూస్తే కంపెనీకి ఏటా 85-90 కోట్ల ఆర్డర్‌ల నుంచి అదనంగా ఒక రూపాయి పెంచినా కూడా రూ. 85-90 కోట్ల ఆదాయం లభిస్తుంది. Zomato ప్రతిరోజూ సగటున 25-30 లక్షల ఆర్డర్‌లను డెలివరీ చేస్తోంది. జొమాటో ప్రతి ఆర్డర్‌పై రూ. 1 అదనంగా వసూలు చేస్తే, ప్రతిరోజూ వారికి రూ. 25-30 లక్షల వరకు లాభం వస్తుంది.
ఇవి కూడా చదవండి:
Anant Ambani Wedding: అనంత్-రాధిక పెళ్లిలో టెక్నాలజీ చుశారా.. ఓ రేంజ్‌లో వాడేశారు..
Airtel: యూజర్లకు మళ్లీ షాకిచ్చిన ఎయిర్ టెల్
Airport: ఇకపై ఈ విమానాశ్రయంలో 24×7 మద్యం దుకాణం ఓపెన్
For Latest News and Business News click here
Updated Date - Jul 15 , 2024 | 01:26 PM