School Building Collapse: కూలిన స్కూల్ బిల్డింగ్.. 22 మంది విద్యార్థులు మృతి, 100 మందికిపైగా గాయాలు
ABN, Publish Date - Jul 13 , 2024 | 09:30 AM
150 మందికిపైగా విద్యార్థులు ఉన్న ఓ పాఠశాల భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలింది(school building collapse). ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు దుర్మరణం చెందగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఆఫ్రికా దేశమైన నైజీరియా(Nigeria)లో చోటుచేసుకుంది.
150 మందికిపైగా విద్యార్థులు (students) ఉన్న ఓ పాఠశాల భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలింది(school building collapse). ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు దుర్మరణం చెందగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఆఫ్రికా దేశమైన నైజీరియా(Nigeria)లో చోటుచేసుకుంది. ఉత్తర మధ్య నైజీరియాలో శుక్రవారం పిల్లలు తరగతిలో ఉండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
భవనం కూలిపోయిన క్రమంలో 154 మంది విద్యార్థులు(students) శిథిలాల కింద చిక్కుకున్నారని, వారిలో 132 మంది రక్షించబడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. పాఠశాల భవనం కూలిపోవడంతో అప్రమత్తమైన పలువురు పిల్లలు విద్యార్థులు సెయింట్స్ అకాడమీ కళాశాలకు చేరుకున్నారు. మృతి చెందిన విద్యార్థుల వయస్సు 15 ఏళ్ల లోపు ఉంటుందని అధికారులు అన్నారు. ప్రమాదం తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న 100 మందికి పైగా ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు.
నైజీరియా(Nigeria) నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ రెస్క్యూ, హెల్త్ వర్కర్స్‌తో పాటు భద్రతా దళాలను ప్రమాద స్థలానికి మోహరించింది. ఆ క్రమంలో వైద్య సదుపాయాన్ని అందించడానికి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేదా చెల్లింపు లేకుండా చికిత్స ప్రారంభించాలని నైజీరియా ప్రభుత్వం ఆజా ఆసుపత్రులను ఆదేశించింది. అయితే పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం, నది ఒడ్డున ఉండడం వల్లే ఈ ఘోర ప్రమాదం చోటేచేసుకుందని అక్కడి ప్రభుత్వం అంటోంది. కానీ స్థానికులు మాత్రం స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Israel Hamas War: 70 మందికిపైగా మృత్యువాత.. గాజాలో పెరిగిన హింసాత్మక ఘటన
Hyderabad: అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
Read Latest International News and Telugu News
Updated Date - Jul 13 , 2024 | 01:38 PM