Drug Seizure: ఏకంగా 500 కిలోల డ్రగ్స్ స్వాధీనం.. పోలీసుల అదుపులో పలువురు
ABN, Publish Date - Nov 29 , 2024 | 10:40 AM
పలువురు కలిసి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు పడవల్లో వెళ్తున్న క్రమంలో అధికారులు కట్టడి చేశారు. విశ్వసనీయంగా సమాచారం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి ఏకంగా 500 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
గుట్టచప్పుడు కాకుండా డ్రగ్స్ (Drug Seizure) సరఫరా చేస్తున్న ముఠాను అధికారులు చేధించారు. ఈ క్రమంలో ఏకంగా 500 కిలోల మాదకద్రవ్యాలను (క్రిస్టల్ మెత్) స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు రెండు పడవలు, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. భారత నౌకాదళం, శ్రీలంక నౌకాదళం సంయుక్త ఆపరేషన్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అరేబియా సముద్రంలో రెండు పడవలలో దాదాపు 500 కిలోల మాదకద్రవ్యాలను (క్రిస్టల్ మెత్) తరలిస్తున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం శ్రీలంక అధికారులకు వారిని అప్పగించారు.
సమాచారం మేరకు
పడవలను అడ్డగించడానికి శ్రీలక నేవీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. ఆ క్రమంలో భారత్ సమన్వయంతో ఈ ఆపరేషన్ గురించి వేగంగా స్పందించి పూర్తి చేశారు. ఈ క్రమంలో రెండు పడవలు, సిబ్బందితో పాటు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం శ్రీలంక అధికారులకు అప్పగించారు. ఈ ఆపరేషన్ ద్వారా ప్రాంతీయ సముద్ర సవాళ్లను పరిష్కరించుకున్నారు. దీంతోపాటు IndianOceanRegionలో భద్రతను నిర్ధారించుకోవడానికి రెండు నౌకాదళాల సంయుక్త సంకల్పాన్ని సూచిస్తుందని అంటున్నారు.
ఎక్కడి నుంచి ఎక్కడికి
అయితే స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ ఎంత, వాటిని ఎక్కడికి తరలించే క్రమంలో అధికారులు పట్టుకున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు అధికారులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎంత మంది డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయం కూడా తేలాల్సి ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదివరకు గుజరాత్ తీర ప్రాంతంలో రెండు వేల కేజీలకుపైగా డ్రగ్స్ దొరకడం కూడా గతంలో కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు నిఘాను పెంచారు.
ఇవి కూడా చదవండి:
Cyber Fraud: రూ. 30 లక్షల సైబర్ మోసాన్ని చాకచక్యంగా అడ్డుకున్న ఎస్బీఐ అధికారులు
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
BSNL: మరో అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 90 రోజులకు చెల్లించేది కేవలం..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Crime News and Latest Telugu News
Updated Date - Nov 29 , 2024 | 10:53 AM