Hyderabad: మనస్తాపంతో పురుగులమందు తాగి సూసైడ్.. పక్కింటి వ్యక్తి వేధింపులే కారణమా..
ABN, Publish Date - Jan 28 , 2024 | 11:06 AM
హైదరాబాద్ లోని ఉప్పల్ రామాంతపూర్ రవీందర్ రెడ్డి నగర్ లో పెరకా శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పక్కింట్లో ఉండే నాగరాజు వేధింపుల వల్లే శ్రీనివాస్ చనిపోయాడని బంధువులు, కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఉప్పల్ రామాంతపూర్ రవీందర్ రెడ్డి నగర్ లో పెరకా శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పక్కింట్లో ఉండే నాగరాజు వేధింపుల వల్లే శ్రీనివాస్ చనిపోయాడని బంధువులు, కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. నాగరాజు, శ్రీనివాస్ ల ఇళ్లు పక్కపక్కన ఉండడంతో నాగరాజు తరచు వేధింపులకు పాల్పడేవాడని తెలిపారు. తాను మాజీ హోం మినిస్టర్ వద్ద పని చేస్తానని.. శ్రీనివాస్ తో పాటు కాలనీ వాసులను తుపాకీతో బెదిరిస్తూ వేధించేవాడని పలువురు వెల్లడించారు.
ఈ వేధింపులు తాళలేకే మనస్తాపంతో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతని మృతికి నాగరాజే కారణమని నాగరాజు ఇంటిపై మృతుడి బంధువులు, కాలనీవాసులు దాడి చేశారు. శ్రీనివాస్ మృతదేహాన్ని నాగరాజు ఇంటిముందు ఉంచి ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాస్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 28 , 2024 | 11:06 AM