IIT Student: ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తూ పట్టుబడ్డ ఐఐటీ విద్యార్థి
ABN, Publish Date - Mar 24 , 2024 | 07:54 AM
ఓ విద్యార్థి ఏకంగా ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిద్ధమయ్యాడు. అంతే సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ విద్యార్థి ఐఐటీ-గౌహతికి చెందిన ఓ విద్యార్థి(IIT-Guwahati student) కావడం విశేషం.
ఓ విద్యార్థి ఏకంగా ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిద్ధమయ్యాడు. అంతే సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ విద్యార్థి ఐఐటీ-గౌహతికి చెందిన ఓ విద్యార్థి(IIT-Guwahati student) కావడం విశేషం. అసోంలోని కమ్రూప్ జిల్లా హజో(Hajo) సమీపంలో శనివారం రాత్రి అతడిని పోలీసులు పట్టుకున్నారు.
ISIS ఇండియా చీఫ్ హరీస్ ఫరూఖీ, అతని సహచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్‌లు బంగ్లాదేశ్ నుంచి దాటిన తర్వాత ధుబ్రిలో అరెస్టు చేసిన నాలుగు రోజుల తర్వాత ఈ విద్యార్థి పట్టుబడ్డాడు. ఐఎస్ఐఎస్(ISIS) వైపు మొగ్గు చూపుతున్న ఐఐటీ గౌహతి విద్యార్థి యాత్రలో వెళ్తున్న క్రమంలో అదుపులోకి తీసుకున్నట్లు అస్సాం డీజీపీ జీపీ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఓ విద్యార్థి ఇమెయిల్(email) ద్వారా తమకు సమాచారం వచ్చిందని పోలీసు సూపరింటెండెంట్ (STF) కళ్యాణ్ కుమార్ పాఠక్ తెలిపారు. అందులో ఓ వ్యక్తి ISISలో చేరబోతున్నట్లు పేర్కొన్నాడు. ఆ క్రమంలో ఐఐటీ-గౌహతి అధికారులను సంప్రదించామని పాఠక్ తెలిపారు. ఆ విద్యార్థి మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడని, అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉందని సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు(police) రంగంలోకి దిగి విద్యార్థి కోసం అన్వేషణ ప్రారంభించామన్నారు.
సాయంత్రం స్థానికుల సహాయంతో గౌహతికి(Guwahati) 30 కిలోమీటర్ల దూరంలోని హజో(Hajo) ప్రాంతం నుంచి పట్టుకున్నామని ఏఎస్పీ పాఠక్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుడు నాలుగో సంవత్సరం విద్యార్థి అని, ఢిల్లీలోని ఓఖ్లా నివాసి అని ఆయన వెల్లడించారు. విద్యార్థి హాస్టల్ గదిలో ISIS మాదిరిగానే నల్ల జెండా కనిపించిందని పోలీసు అధికారులు తెలిపారు. నిషేధిత సంస్థలతో వ్యవహరించే ప్రత్యేక దర్యాప్తు సంస్థలకు ధృవీకరణ కోసం ఇది పంపబడుతుంది. దీంతోపాటు ఇమెయిల్ వచ్చిన ఉద్దేశాన్ని కూడా పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: KKR vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి ఈ ఆటగాళ్లే కారణం?
Updated Date - Mar 24 , 2024 | 07:57 AM