Bangalore: మగశిశువు విక్రయం కేసులో వైద్యురాలి అరెస్టు
ABN, Publish Date - Oct 11 , 2024 | 12:28 PM
పవిత్రమైన వైద్య వృత్తి చేపట్టి డబ్బు కోసం అక్రమాలకు పాల్పడ్డ వైద్యురాలు కటకటాలపాలయ్యింది. దావణగెరె(Davanagere)లో నవజాతశిశువు విక్రయానికి సంబంధించిన వివాదంలో డాక్టర్ సహా 8మందిని అరెస్టు చేశారు.
- మరో ఏడుగురు కూడా..
బెంగళూరు: పవిత్రమైన వైద్య వృత్తి చేపట్టి డబ్బు కోసం అక్రమాలకు పాల్పడ్డ వైద్యురాలు కటకటాలపాలయ్యింది. దావణగెరె(Davanagere)లో నవజాతశిశువు విక్రయానికి సంబంధించిన వివాదంలో డాక్టర్ సహా 8మందిని అరెస్టు చేశారు. ఎంకే మెమోరియల్ ఆసుపత్రి డాక్టర్ భారతి, శిశువు తల్లి కావ్య, శిశువును కొనుగోలు చేసిన ప్రశాంత్, జయ దంపతులతోపాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన వాజిరాజ్, మంజమ్మ, సురేశ్, రమేశ్‌లను అరెస్టు చేశారు. రెండున్నర నెలల మగశిశువును స్త్రీ శిశుసంక్షేమశాఖ సంరక్షణా కేంద్రంలో ఉంచారు.
ఈ వార్తను కూడా చదవండి: Bangalore: కొవిడ్ అక్రమాలపై విచారణ..
హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినవారు శిశువును పొందిన సమాచారం ఇవ్వడంతో జిల్లా మహిళా పోలీసులు, స్త్రీ శిశుసంక్షేమశాఖ అధికారి టిఎన్ కవితా నేతృత్వంలో కార్యాచరణ జరిపారు. 8మందిని గురువారం జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. విడాకులు తీసుకున్న కావ్య రెండున్నర నెలలక్రితం మహారాష్ట్ర(Maharashtra)లోని సొల్హాపురలో ఓ శిశువుకు జన్మనిచ్చారు. దావణగెరెకు వచ్చిన ఆమె శిశువును విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఎనిమిదేళ్లుగా పిల్లలు లేని దంపతులు మధ్యవర్తి వాజిరాజ్ ద్వారా రూ.5లక్షలకు కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఎంకె మెమోరియల్ ఆసుపత్రి డాక్టర్ భారతి, సిబ్బంది మంజుళ నకిలీ జన్మధ్రువీకరణ పత్రాన్ని తయారు చేసి సహకరించారు. జయ, ప్రశాంత్ దంపతులకు ఆగస్టు 26న శిశువు జన్మించినట్లుగా డాక్టర్ భారతి రికార్డును సృష్టించారు. వాటికి అనుగుణంగానే దావణగెరె మహానగర పాలికె బర్త్ సర్టిఫికెట్ మంజూరు చేసింది. హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్‌కాల్ ఆధారంగా దర్యాప్తు జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సాక్షాత్తు వైద్యులే శిశువుల అక్రమాలు ప్రోత్సహించ డంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రైవేట్ ఆస్ప్రతులపై నిఘా పెచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభి ప్రాయపడుతున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?
ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు
ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్
ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి
Read Latest Telangana News and National News
Updated Date - Oct 11 , 2024 | 12:28 PM