ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Madhya Pradesh: దారుణం.. అశ్లీల వీడియోలు చూసి చెల్లిపైనే అత్యాచారం.. ఆపై..

ABN, Publish Date - Jul 27 , 2024 | 07:50 PM

మన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఓ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అశ్లీల వీడియోలకు అలవాటుపడ్డ ఓ మైనర్ బాలుడు.. తన సొంత చెల్లిపైనే అత్యాచారానికి..

Madhya Pradesh Incident

మన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఓ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) చోటు చేసుకుంది. అశ్లీల వీడియోలకు అలవాటుపడ్డ ఓ మైనర్ బాలుడు.. తన సొంత చెల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను కిరాతకంగా హతమార్చాడు. మరో ఘోరం ఏమిటంటే.. ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు అతనికి తల్లితో పాటు మరో ఇద్దరు సోదరీమణులు సహాయం చేశారు. ఎవరో ఆమెను చంపేసినట్లు కట్టుకథ అల్లేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి.. వాళ్లు తమ నేరాన్ని అంగీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


చెల్లిపైనే అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని రేవాలో నివాసముంటున్న దంపతులకు ఒక కుమారుడు (13), ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆ బాలుడికి మొబైల్ ఫోన్‌లో నిత్యం అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే అతను ఏప్రిల్ 24వ తేదీన అర్థరాత్రి అందరూ నిద్రపోయాక.. తన సొంత చెల్లి (9)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అన్నయ్యే తనపై అఘాయిత్యానికి పాల్పడటంతో కుమిలిపోయిన ఆ బాలిక.. ఈ విషయాన్ని తండ్రికి చెప్తానని పేర్కొంది. దీంతో భయపడిపోయిన ఆ బాలుడు.. ఆమెను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అనంతరం తల్లిని నిద్రలేపి.. మొత్తం విషయం చెప్పాడు. బాధితురాలు ఇంకా బతికే ఉందని తెలిసి, మరోసారి గొంతు నులిమి ఆమెను హతమార్చాడు. ఇంతలో మరో ఇద్దరు సోదరీమణులు కూడా నిద్రలేచారు. ఏం జరిగిందో తెలుసుకుని వాళ్లు ఖంగుతిన్నారు.


కేసును తప్పుదోవ పట్టించేందుకు..

అయితే.. తమ ఇంటి వారసుడు ఒకడేనన్న ఉద్దేశంతో, నిందితుడ్ని ఈ కేసు నుంచి బయటపడేయాలని తల్లితో పాటు ఇద్దరు సోదరీమణులు కలిసి ఒక ప్లాన్ వేశారు. తమతమ బెడ్ పొజిషన్‌లను మార్చేశాడు. ఆపై బాలిక మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పడేశారు. అనంతరం ఏం తెలియనట్టుగా నటించారు. ఉదయాన్నే నిద్ర లేచాక.. బాలికను ఎవరో చంపేశారంటూ డ్రామాలు ఆడటం మొదలుపెట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. ఆ బాలికపై అత్యాచారం చేసి, ఆపై హతమార్చినట్లు రిపోర్టులో తేలింది. దాని ఆధారంగా.. పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడ్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు.


విచారణలో షాకింగ్ నిజాలు

తొలుత ఇంట్లోకి ఎవరైనా చొరబడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన సంకేతాలేమీ కనిపించలేదు. తాము కూడా అసాధారణ శబ్దాలేమీ వినలేదని కుటుంబసభ్యులు బుకాయించారు. విచారణలో భాగంగా.. మొత్తం 50 మందిని విచారించారు. చివరాఖరికి.. కుటుంబ భస్యులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో.. వారిపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో.. వారిని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అప్పుడు తల్లి సహా ఇద్దరూ అక్కలు అసలు నిజం కక్కేశారు. తమ సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, తాము కేసుని తప్పుదోవ పట్టించేందుకు డ్రామాలాడమని తెలిపారు. దాంతో.. వారిని అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

Read Latest Crime News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 07:50 PM

Advertising
Advertising
<