ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: చదువుల కోవెలలో అమానుష ఘటన.. విద్యార్థినిపై ఇద్దరి అత్యాచారం

ABN, Publish Date - Dec 26 , 2024 | 11:13 AM

దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన అన్నా విశ్వవిద్యాలయం(Anna University)లో ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన ఈ దారుణం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

- బాధితురాలి ప్రియుడిపై దాడి

- విద్యార్థి సంఘాల ఆందోళన

చెన్నై: దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన అన్నా విశ్వవిద్యాలయం(Anna University)లో ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన ఈ దారుణం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఆమె తన ప్రియుడితో కలిసి వున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రియుడిపై దాడి చేసి అతడిని అక్కడి నుంచి బలవంతంగా పంపించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డును ఉన్న అన్నా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారం జరగడం ప్రతి ఒక్కరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది.

ఈ వార్తను కూడా చదవండి: Alcohol sales: జనవరి నుంచి టాస్మాక్‌లో ‘క్యూ ఆర్‌’ కోడ్‌తో మద్యం విక్రయాలు


ఈ ఘటనను అన్ని రాజకీయ పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... కన్నియాకుమారి(Kanyakumari) జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని అన్నావర్సిటీలో ఇంజనీరింగ్‌ చదువుతోంది. ఇదే క్యాంప్‌సలో ఇంజనీరింగ్‌ చదువుతున్న తన సీనియర్‌ విద్యార్థితో ప్రేమలో పడింది. వీరిద్దరూ క్యాంపస్‌లో వేర్వేరు వసతి గృహాల్లో ఉంటున్నారు. అయితే, వీరిద్దరూ రాత్రిపూట వర్సిటీ క్యాంప్‌సలో పెద్దగా జనసంచారం లేనిచోట రాత్రి బాగా పొద్దుపోయే వరకు కూర్చొని మాట్లాడుకునే వారు.


అదేవిధంగా సంఘటన జరిగిన రోజు కూడా వీరిద్దరూ కలిసివుండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ప్రియుడిని చితకబాదారు. అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు. ఆ తర్వాత ఆ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనకు జరిగిన దారుణంపై బాధితురాలు కొట్టూర్పురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. యూనివర్సిటీకి చెందిన విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని నిందితుల గుర్తింపు కోసం పరేడ్‌ కూడా నిర్వహించారు. మరోవైపు బాలికపై అత్యాచారం చేయడంతో పాటు ఆమెను నగ్నంగా వీడియోలు తీసినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత బుధవారం అన్నా విశ్వవిద్యాలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. కేవలం గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే క్యాంప్‌సలోకి అనుమతించారు.


- రాజకీయ నేతల ఖండన

దేశంలోనే గుర్తింపు పొందిన అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనను మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై, సీపీఎం నేత కే.బాలకృష్ణన్‌, పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ముక్త కంఠంతో ఖండించారు. రాజధాని నడిబొడ్డున విద్యార్థినిపై లైంగికదాడి జరగడం రాష్ట్రానికే సిగ్గుచేటని, ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగి 12 యేళ్ళు గడిచినప్పటికీ అదే తరహా ఘటన చెన్నైలో జరగడం శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయనే విషయాన్ని చెబుతోందని నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైన డీఎంకే ప్రభుత్వాన్ని వారంతా ముక్తకంఠంతో ఖండించారు. ఈ లైంగిక దాడికి పాల్పడిన వారిని తక్షణం గుర్తించి అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.


నిందితుడి అరెస్టు

విద్యార్థినిపై జరిగిన లైంగికదాడి కేసులో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడు కోట్టూరుకు చెందిన జ్ఞానశేఖరన్‌ (37)గా గుర్తించారు. ఆ వ్యక్తిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. అలాగే, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అంతే కాకుండా యూనివర్శిటీ ప్రాంగణంలో విద్యార్థినీ విద్యార్థులకు భద్రత కల్పించేందుకు చెన్నై నగర పోలీసు ఉన్నతాధికారులు, యూనివర్సిటీ భద్రతా అధికారులు కలిసి (జాయింట్‌ సెక్యూరిటీ రివ్యూ) చర్చించి యూనివర్శిటీ క్యాంపస్‏లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇదిలా వుండగా యువతిపై అత్యాచారాన్ని ఖండిస్తూ ఎస్‌ఎ్‌ఫఐ నేతలు బుధవారం యూనివర్సిటీ గేటు ముందు ఆందోళన చేపట్టారు.


ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2024 | 11:13 AM