Cyber criminal: నిమిషాల వ్యవధిలో రూ 13.5 లక్షలు గోవిందా..
ABN, Publish Date - Nov 22 , 2024 | 11:49 AM
సైబర్ ఉచ్చులో పడి తిరుపతికి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రూ.13.5 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు తెలిపిన ప్రకారం.. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటకు చెందిన ఎరువుల వ్యాపారి (మార్కెటింగ్) జయరామిరెడ్డికి తిరుపతిలో ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంది.
- సైబర్ ఉచ్చులో ఎరువుల వ్యాపారి
తిరుపతి: సైబర్ ఉచ్చులో పడి తిరుపతి(Tirupati)కి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రూ.13.5 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు తెలిపిన ప్రకారం.. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట(Tummalagunta)కు చెందిన ఎరువుల వ్యాపారి (మార్కెటింగ్) జయరామిరెడ్డికి తిరుపతిలో ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంది. అకౌంటు వుంది. ఈయన ప్రమేయం లేకుండానే ‘వీఐపీ ఈ7 ఇన్వెస్టుమెంట్ అలియన్స్ లెర్నింగ్’ వాట్సాప్ గ్రూప్(WhatsApp group)లో యాడ్ అయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: జగన్‌ను ఆ సమయంలో వైఎస్సార్ దూరం పెట్టారు.. వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్
ఈ గ్రూప్‌లో వచ్చిన ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేశారు. అప్పుడు ఆయన మొబైల్‌లో ఫేక్ ‘సీడబ్ల్యూఏ మ్యానేజ్’ యాప్ కూడా డౌన్‌లోడ్ అయింది. అందులో ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ చేశారు. అనంతరం అతడి ఖాతాలో రూ.24.3 లక్షలు కనిపించాయి. ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయబోగా యాప్ కనిపించకుండా పోయింది. తాను మోసపోయాయని తెలుసుకున్న ఆయన.. రూ.13.5 లక్షలు నష్టపోయినట్లు తిరుపతి రూరల్ పోలీసు స్టేషనులో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ చిన్నగోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య
ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..
ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 22 , 2024 | 11:49 AM