ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vizag airport: ప్రయాణికుల బ్యాగుల్లో కేక్ బాక్సులు.. ఏముందా అని చూడగా దిమ్మతిరిగే సీన్..

ABN, Publish Date - Nov 27 , 2024 | 02:04 PM

అక్రమరవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు వెండి, బంగారు బిస్కెట్లను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుంటే, మరికొందరు మంచి డిమాండ్ ఉన్న వణ్యప్రాణులను దిగుమతి, ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో వారు పోలీసులకు దొరక్కుండా వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు అక్రమంగా తరలించే తీరు చూస్తే అధికారులే ఆశ్చర్యపోయేలా ఉంటుంది. ఇలాంటి ..

అక్రమరవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు వెండి, బంగారు బిస్కెట్లను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తుంటే, మరికొందరు మంచి డిమాండ్ ఉన్న వణ్యప్రాణులను దిగుమతి, ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో వారు పోలీసులకు దొరక్కుండా వివిధ రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు అక్రమంగా తరలించే తీరు చూస్తే అధికారులే ఆశ్చర్యపోయేలా ఉంటుంది. ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా విశాఖపట్నం విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానశ్రయంలో ప్రయాణికుల వద్ద ఉన్న కేక్ బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీరా వాటిని తెరచి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


విశాఖపట్నం (Visakhapatnam) విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విశ్వనసీయ సమాచారం మేరకు విమానాశ్రయ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో థాయ్‌లాండ్ నుంచి విశాఖపట్నం వస్తున్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగులను పరిశీలించగా.. అందులో కొన్ని కేక్ బాక్సులు కనిపించాయి. అయితే వాటిని చూడగానే అధికారులకు అనుమానం వచ్చి బయటికి తీసి ఓపెన్ చేశారు. తీరా అందులో చూడగా.. సజీవంగా ఉన్న తూర్పు నీలం నాలుకగల బల్లులు (Eastern Blue Tongue Lizards) కనిపించాయి.


బాక్సులను మొత్తం తీసి చూడగా మొత్తం ఆరు బల్లులు కనిపించాయి. వాటిని తిరిగి థాయ్‌ల్యాండ్‌కు పంపించిన అధికారులు.. ఇద్దరు ప్రయాణికులనూ అదుపులోకి తీసుకుని, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, వాటిని ఇండియాలో ఎక్కడికి తరలిస్తున్నారు.. తదితర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు తెలిపారు. ఇలా విదేశాల నుంచి వివిధ రకాల వణ్యప్రాణులను తరలించడం ఇదేమీ కొత్తేమీ కాదు. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు విషపూరిత పామునుల సీజ్ చేసిన విషయం తెలిసిందే. బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరు మహిళలపై అనుమానం వచ్చి, లగేజీ పరిశీలించగా అందులో మూడు విషపూరిత పాములు కనిపించాయి.


అలాగే విదేశాల్లో అలుగులకు మంచి డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు వీటిని గుట్టుచప్పుడు కూకుండా తరలిస్తున్నారు. అదేవిధంగా తాబేళ్లు, కొండచిలువులు, ముంగిసలు, తదితర 50కి పైగా జాతుల వణ్యప్రాణులను వాయు, భూ మార్గం ద్వారా మలేషియా, థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ ప్రకారం 2021లో కస్టమ్స్ తనిఖీల్లో 3,316 వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు.


అదేవిధంగా 2022లో 3,428 వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. 2023-24 లో ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. వివిధ జాతులకు చెందిన బల్లులు, సరీసృపాలను అనుమానరం రాకుండా సాక్సులు, బొమ్మలు తదిరాల్లో ఉంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. కాగా, విశాఖపట్నం విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న తూర్పు నీలం నాలుకగల బల్లులకర సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Updated Date - Nov 27 , 2024 | 02:05 PM