Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది కూలీలు మృతి
ABN, Publish Date - Apr 09 , 2024 | 11:07 AM
కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి దాదాపు 200 మీటర్ల లోతులో ఉన్న గుంతలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మందిలో 8 మంది మృత్యువాత చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand)లోని నైనిటాల్(Nainital district) జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి దాదాపు 200 మీటర్ల లోతులో ఉన్న గుంతలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మందిలో 8 మంది మృత్యువాత చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand)లోని నైనిటాల్(Nainital district) జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే మృతి చెందిన వారిలో ఎక్కువ మంది నేపాలీ కూలీలు(Nepalese citizens) ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం ప్రకారం ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, ఒకరు ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలిసింది.
సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో నైనిటాల్(Nainital) జిల్లాలోని బేతాల్‌ఘాట్ ఉండకోట్ నుంచి తనక్‌పూర్‌కు వెళ్తున్న క్రమంలో మల్లాగావ్ వద్ద ప్రమాదం జరిగిందని అధికారులు అన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నైనిటాల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 60కి.మీ దూరంలో ఉంది. పోలీసులు(police), రెస్క్యూ టీం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి
Stock Market: స్టాక్ మార్కెట్ బూమ్.. మొదటిసారిగా 75000 దాటిన సెన్సెక్స్, నిఫ్టీ కూడా
మరిన్ని క్రైం వార్తల కోసం
Updated Date - Apr 09 , 2024 | 11:37 AM