ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Electoral Officer: కనిపించకుండా పోయిన ఎన్నికల అధికారి... శవంగా గుర్తింపు

ABN, Publish Date - Apr 02 , 2024 | 12:31 PM

దక్షిణకన్నడ జిల్లాలో ఎన్నికల అధికారి(Electoral Officer)గా వ్యవహరిస్తూ కనిపించకుండాపోయిన వ్యక్తి మృతదేహాన్ని ధర్మస్థళ సమీపంలో గుర్తించారు.

- దక్షిణకన్నడ జిల్లాలో ఘటన

బెంగళూరు: దక్షిణకన్నడ జిల్లాలో ఎన్నికల అధికారి(Electoral Officer)గా వ్యవహరిస్తూ కనిపించకుండాపోయిన వ్యక్తి మృతదేహాన్ని ధర్మస్థళ సమీపంలో గుర్తించారు. జిల్లా పరిధిలోని అంటాడి గ్రామపంచాయతీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లక్ష్మినారాయణ ఎన్నికల విధులలో ఉన్నారు. మార్చి 27న విధి నిర్వహణలోకి వచ్చిన ఆయన అదే రోజు కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు పుంజలకట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విధులు ముగించుకుని బయటకు వచ్చిన ఆయన ఫోన్‌ కొద్దిసేపటికే స్విచ్ఛాఫ్‌ కావడంతో ఆయన తమ్ముడు అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బంట్వాళ ఎన్నికల అధికారి పోలీసులతో గాలింపులకు ఆదేశించారు. బెళ్తంగడిలో ఆయన మోటర్‌సైకిల్‌ను గుర్తించారు. మార్చి 30వ తేదీ వరకు పట్రమ పరిధిలో ఆయన మొబైల్‌ సిగ్నల్‌ వాడినట్టు గుర్తిం చారు. చివరకు ఆదివారం సాయంత్రం ధర్మస్థళ సమీపంలోని కాలువలో లక్ష్మినారాయణ మృతదేహాన్ని గుర్తించారు. అతడి వద్ద ఆధారాలను బట్టి కుటుంబీకులు తెలుసుకున్నారు. లక్ష్మి నారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా హతమార్చారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

ఇదికూడా చదవండి: Siddaramaiah: నేను సీఎంగా ఉండాలంటే.. వరుణలో 60వేల మెజారిటీ రావాలి

Updated Date - Apr 02 , 2024 | 12:31 PM

Advertising
Advertising