ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Forest Workers Died: మంటలను ఆర్పేందుకు వెళ్లిన నలుగురు అటవీ సిబ్బంది సజీవదహనం..మరో నలుగురికి..

ABN, Publish Date - Jun 14 , 2024 | 09:56 AM

ఉత్తరాఖండ్‌(Uttarakhand) అల్మోరా(Almora) బిన్సార్ అభయారణ్యంలో చెలరేగిన కార్చిచ్చు(fire accident) ఇంకా చల్లారడం లేదు. ఈ అగ్నిప్రమాదం కారణంగా అడవులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు అడవికి చేరుకున్నారు. ఆ క్రమంలో మంటలను ఆర్పేక్రమంలో అటవీ సిబ్బందిలో నలుగురు వ్యక్తులు మరణించారు.

Uttarakhand Almora fire accident

ఉత్తరాఖండ్‌(Uttarakhand) అల్మోరా(Almora) జిల్లాలోని బిన్సార్ అభయారణ్యంలో చెలరేగిన కార్చిచ్చు(fire accident) ఇంకా చల్లారడం లేదు. ఈ అగ్నిప్రమాదం కారణంగా అడవులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంటలు చెలరేగినట్లు సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు అడవికి చేరుకున్నారు. ఆ క్రమంలో మంటలను ఆర్పేక్రమంలో అటవీ సిబ్బందిలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో నలుగురు వ్యక్తులు సీరియస్‌గా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మృతుల్లో అటవీ శాఖలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు, పీఆర్డీ జవాన్లు ఉన్నారు. ఈ ఘటనతో వారి కుటుంబాలలో విషాదం నెలకొంది.


ప్రభుత్వ వాహనం కూడా..

గురువారం మధ్యాహ్నం బిన్సార్ అభయారణ్యంలోని గరడ్ బురుష్ గుడిసె సమీపంలో మంటలు వ్యాపించినట్లు అటవీ శాఖ సిబ్బందికి(forest workers) సమాచారం వచ్చింది. ఆ తర్వాత అటవీ శాఖ సిబ్బంది డిపార్ట్‌మెంటల్ బొలెరో వాహనం UK 01-GA-0124లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ క్రమంలో మంటలను ఆర్పేందుకు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పేలోపే ఉద్యోగులు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మంటల్లో తీవ్రంగా కాలిన గాయాలతో నలుగురు అటవీ సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో క్షతగాత్రులను ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన కృష్ణకుమార్, కుందన్ సింగ్‌లను ఉన్నత కేంద్రానికి తరలించారు. ఈ క్రమంలో వాహనం కూడా మంటల్లో (fire)కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న మరికొంత మంది అటవీశాఖ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు.


ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అల్మోరా ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్ ధామి(pushkar singh dhami) విచారం వ్యక్తం చేశారు. ఈ దుఃఖ సమయంలో తమ ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వారిని వెంటనే హల్ద్వానీ బేస్ హాస్పిటల్‌కు తరలించాలని, మృతుల శాంతి కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు స్పష్టం చేశారు.


ఇది కూడా చదవండి:

Rain Alert: బాబోయ్.. ఇటు ఎండలు.. అటు నాలుగు రోజులపాటు వర్షాలు!


Kuwait Fire: 45 మంది భారతీయుల మృతదేహాలతో కొచ్చికి బయలుదేరిన IAF విమానం

Read Latest Crime News and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 10:03 AM

Advertising
Advertising