Hyderabad: ఛీ.. ఛీ.. కాపాడాల్సిన పోలీసే..కామవాంచతో బాలికపై అత్యాచారం
ABN, Publish Date - Jun 27 , 2024 | 12:38 PM
హైదరాబాద్(hyderabad) పరిధిలో రోజు రోజుకు బాలికలపై(girls) జరిగే అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరం ఎంత అభివృద్ధి చెందినా కూడా పలువురి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా బాలికలను కాపాడాల్సిన ఓ పోలీసే అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్(hyderabad) పరిధిలో రోజు రోజుకు బాలికలపై(girls) జరిగే అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరం ఎంత అభివృద్ధి చెందినా కూడా పలువురి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. తెలిసి తెలియని అమాయక బాలికలపై పలువురు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలికలను కాపాడాల్సిన ఓ పోలీసే అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇక వివరాల్లోకి వెళితే రాజేంద్రనగర్(Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ కానిస్టేబుల్(constable) ఓ బాలికపై కన్నేశాడు. ఆమె కదలికలు, ఆమె గురించి క్రమంగా తెలుకుని మాటలు కలిపాడు. ఆక్రమంలోనే ఆ బాలికకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా అత్యాచారం చేసిన వీడియోలు అడ్డు పెట్టుకుని కానిస్టేబుల్ ఆ బాలికను బెదిరించాడు. ఆ విధంగా వీడియోలతో బెదిరిస్తూ పలుమార్లు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ నేపథ్యంలో యువతి ప్రవర్తనలో మార్పు చూసిన ఆమె తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలిక తల్లిదండ్రులు ఆ కానిస్టేబుల్‌పై రాజేంద్రనగర్ పీఎస్(police station)లో ఫిర్యాదు చేశారు. అయితే గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలపై ఈ కానిస్టేబుల్ సస్పెండ్ కావడం విశేషం. అయినప్పటికీ అతని తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇది తెలిసిన పలువురు ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మళ్లీ తప్పులు చేయకుండా శిక్ష వేయాలని అంటున్నారు.
ఇది కూడా చదవండి:
Hyderabad: బ్యాంక్‌ను మోసగించిన మేనేజర్ అరెస్ట్..
Chennai: 63కి పెరిగిన కల్తీసారా మృతుల సంఖ్య
T20 World Cup 2024: నేడు ఇండియా, ఇంగ్లండ్ మధ్య కీలక మ్యాచ్.. గెలుపెవరిది?
Married Womens: ఈ కంపెనీలో పెళ్లైన మహిళలకు నో జాబ్స్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం
For Latest News and Crime News click here
Updated Date - Jun 27 , 2024 | 12:43 PM