ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL Betting: అప్పులు తెచ్చి IPL బెట్టింగ్ చేసి కోటి కోల్పోయిన భర్త.. భార్య ఆత్మహత్య

ABN, Publish Date - Mar 27 , 2024 | 11:34 AM

ఐపీఎల్(ipl) వచ్చిందంటే చాలు అనేక మంది బెట్టింగ్(betting) చేసేందుకు సిద్ధంగా ఉంటారు. దీని ద్వారా కొంత మంది లాభపడగా, అనేక మంది నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఐపీఎల్ బెట్టింగ్ ద్వారా భారీగా డబ్బులు సపాందించాలనే ఆశతో పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి డబ్బులు(money) పెట్టాడు.

ఐపీఎల్(ipl 2024) వచ్చిందంటే చాలు అనేక మంది బెట్టింగ్(betting) చేసేందుకు సిద్ధంగా ఉంటారు. దీని ద్వారా కొంత మంది లాభపడగా, అనేక మంది నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఐపీఎల్ బెట్టింగ్ ద్వారా భారీగా డబ్బులు సపాందించాలనే ఆశతో పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి డబ్బులు(money) పెట్టాడు. అలా పెట్టిన డబ్బులు మొత్తం తిరిగి రాకపోవడంతో కోటి రూపాయలకుపైగా నష్టపోయాడు. మరోవైపు అప్పులిచ్చిన వారి వేధింపులు కూడా పెరగడంతో అవి తట్టుకోలేని అతని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

కర్ణాటక(karnataka) చిత్రదుర్గంలోని హోస్‌దుర్గలో ఉంటున్న రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఉద్యోగి దర్శన్ బాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌(online betting)లకు అలవాటు పడ్డాడు. ఆ క్రమంలో కోటి రూపాయలకు పైగా నష్టపోయాడు. అయితే అప్పులు తీసుకొచ్చి బెట్టింగులు పెట్టడంతో దర్శన్ బాబు కుటుంబానికి వడ్డీ వ్యాపారుల వేధింపులు ఎగ్గువయ్యాయి. దీంతో విసిగిపోయిన అతని 24 ఏళ్ల గృహిణి రంజిత మార్చి 18న ఆత్మహత్య చేసుకుంది. ఆ క్రమంలో రంజిత తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. భర్త దర్శన్‌కు అప్పు ఇచ్చిన వారి వేధింపుల వల్లే రంజిత ఆత్మహత్యకు(suicide) పాల్పడిందని వెల్లడించారు.


రంజిత, దర్శన్ బాలులకు 2020లో వివాహమైందని(marriage) అన్నారు. 2021లో భర్త బెట్టింగ్‌ వ్యసనం ఆమెకు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. అప్పులు ఇచ్చిన వారు భార్యభర్తలను బెదిరించేవారని, వారి ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పడేవారని చెప్పారు. వీటన్నింటి వల్ల రంజితకు ఒత్తిడి పెరిగిపోయి తన జీవితాన్ని కోల్పోయిందని వెల్లడించారు. వడ్డీ వ్యాపారులు దంపతులను ఎలా వేధించారో రంజిత సూసైడ్ నోట్ కూడా రాసిందని పోలీసులు వెల్లడించారు.

ఫిర్యాదు మేరకు పోలీసులు(police) 13 మంది అనుమానితులపై ఐపీసీ 306 కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో దర్శన్ వడ్డీ వ్యాపారుల నుంచి రూ.84 లక్షలు తీసుకున్నట్లు గుర్తించామని పోలీసులు స్పష్టం చేశారు. 2021 నుంచి 2023 వరకు జరిగిన ఐపీఎల్‌లో ఈ భారీ మొత్తాన్ని తీసుకున్నారని చెప్పారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Hyderabad: ద్విచక్రవాహనం రిపేర్‌ విషయంలో గొడవ.. యువకుడి హత్య

Updated Date - Mar 27 , 2024 | 11:37 AM

Advertising
Advertising