ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hydanabad: ట్రాన్స్‌జెండర్‌ దారుణహత్య..

ABN, Publish Date - Jul 13 , 2024 | 10:27 AM

భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ట్రాన్స్‌జెండర్‌(Transgender)ను.. గుర్తుతెలియని దుండగులు చిత్రహింసలకు గురిచేసి, ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌(Sanatnagar Police Station) పరిధిలో వెలుగులోకి వచ్చింది.

- ముక్కలు ముక్కలుగా నరికిన దుండగులు

- డబ్బుకోసం గంజాయి బ్యాచ్‌ చేసిన పనిగా అనుమానం

హైదరాబాద్: భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ట్రాన్స్‌జెండర్‌(Transgender)ను.. గుర్తుతెలియని దుండగులు చిత్రహింసలకు గురిచేసి, ముక్కలు ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌(Sanatnagar Police Station) పరిధిలో వెలుగులోకి వచ్చింది. బాలానగర్‌ ఏసీపీ జి.హనుమంతరావు కథనం ప్రకారం.. ఫతేనగర్‌ వాల్మీకినగర్‌ సమీపంలోని ఓ నిర్మానుష ప్రాంతంలో మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు పరిశీలించి మృతదేహం వరంగల్‌ జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్‌ షీలా అలియాస్‌ షేక్‌ సాజిద్‌ అహ్మద్‌ అబ్బాస్‌ (30)గా గుర్తించారు. షీలా చాలాకాలంగా బాలానగర్‌ హెచ్‌ఎంటీ సొసైటీలో నివాసముంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది.

ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి


గురువారం రాత్రి షీలాను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. తల పగలడంతో పాటు ఒంటిపై పలుచోట్ల పదునైన వస్తువుతో గాయాలు చేసినట్టు ఆనవాళ్లు లభించాయి. ఘటనాస్థలంలో పొడవైన కర్రతో పాటు కొన్ని అనుమానాస్పద వస్తువులను క్లూస్‌టీమ్‌ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, గంజాయి బ్యాచ్‌కు చెందిన పోకిరీలు ఆమెను డబ్బుకోసం చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారా.. లేక ఇంకా ఎవరైనా ప్రత్యర్థి ముఠాలకు చెందినవారు పథకం ప్రకారమే తీసుకెళ్లి హత్య చేసి ఉంటారా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను విశ్లేషిస్తున్నట్లు ఏసీపీ హన్మంతరావు వెల్లడించారు.


ఠాణా వద్ద ట్రాన్స్‌జెండర్ల నిరసన

షీలా హత్యకు కారణమైన వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్‌ చేశారు. భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయని ట్రాన్స్‌జెండర్‌లు ఠాణా వద్ద నిరసనకు దిగారు. గతంలో కూడా పలు హత్యలు జరిగాయని, వీటి వెనుక ఎవరి హస్తం ఉందనేది పోలీసులు దర్యాప్తు చేసి నిర్ధారించాలని డిమాండ్‌ చేశారు. ట్రాన్స్‌జెండర్‌లకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య వారికి మద్దతు పలికారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 10:27 AM

Advertising
Advertising
<