Hyderabad: ఫిబ్రవరిలో 13.61 కిలోల బంగారం పట్టివేత.. రూ.6.03కోట్ల విలువైన పుత్తడి స్వాధీనం
ABN, Publish Date - Mar 05 , 2024 | 11:46 AM
అక్రమంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన 13.61కిలోల బంగారం ఫిబ్రవరి నెలలో పట్టుబడిందని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
శంషాబాద్(హైదరాబాద్): అక్రమంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన 13.61కిలోల బంగారం ఫిబ్రవరి నెలలో పట్టుబడిందని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. గత ఫిబ్రవరి నెలలో వేర్వేరు తేదీల్లో దుబాయ్ నుంచి ముగ్గురు మహిళా ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలించారని తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో వారిని తనిఖీ చేయగా 13.61కిలోల బంగారం పట్టుబడిందన్నారు. దీని విలువ రూ.6.03కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. నిందితులు పొట్టలో, లోదుస్తుల్లో, మెర్క్యురీ కోటింగ్, చైన్స్ రూపంలో బంగారాన్ని తరలించేందుకు యత్నించారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
Updated Date - Mar 05 , 2024 | 11:46 AM