ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: 1400 కిలోల అల్లం వెల్లుల్లి మిశ్రమం సీజ్‌

ABN, Publish Date - Nov 21 , 2024 | 07:11 AM

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమం తయారీ జోరుగా సాగుతోంది. పరిమిత స్థాయిలో అల్లం, వెల్లుల్లి వాడుతూ సింథటిక్‌ రంగులు, సిట్రిక్‌ యాసిడ్‌, ఇతరత్రా పదార్థాలను ఈ మిశ్రమంలో కలుపుతున్నారు. కాటేదాన్‌(Katedan)లో తెలంగాణ కమిషనర్‌ ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు నిర్వహించింది.

- 50 కిలోల సింథటిక్‌ రంగులు సైతం

- ఆనంద్‌బాగ్‌లో హోటల్‌, బేకరీలో తనిఖీలు

హైదరాబాద్‌ సిటీ: మహానగరంలో కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమం తయారీ జోరుగా సాగుతోంది. పరిమిత స్థాయిలో అల్లం, వెల్లుల్లి వాడుతూ సింథటిక్‌ రంగులు, సిట్రిక్‌ యాసిడ్‌, ఇతరత్రా పదార్థాలను ఈ మిశ్రమంలో కలుపుతున్నారు. కాటేదాన్‌(Katedan)లో తెలంగాణ కమిషనర్‌ ఫుడ్‌ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు నిర్వహించింది. అక్కడి ఎస్‌కేఆర్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ సంస్థలో 1000 కిలోలు, ఉమాని ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌లో 400 కిలోల ప్యాకేజ్డ్‌ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌, రంగు వచ్చేలా ఈ మిశ్రమంలో కలిపేందుకు ఉంచిన 50 కిలోల సింథటిక్‌ (టాట్రజైన్‌) రంగులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ సంస్థలు దివాలా


మిశ్రమం తయారు చేస్తున్న కేంద్రాల్లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, గ్రైండింగ్‌, వాష్‌ ఏరియా వద్ద నీటి నిల్వలు, తయారీ, స్టోరేజ్‌లో కనీస ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు. నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిన అధికారులు.. రెండు తయారీ కేంద్రాలను సీజ్‌ చేశారు.

ఆనంద్‌బాగ్‌లో..

జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారి ఆధ్వర్యంలో బుధవారం ఆనంద్‌బాగ్‌లోని మురుగన్‌ హోటల్‌, కాకతీయనగర్‌లోని శ్రీ తిరుమల బేకరీలో జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీ చేశారు. హోటల్‌, బేకరీలో అపరిశుభ్ర వాతావరణం ఉందని గుర్తించి కేసు నమోదు చేశారు.


ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్‌ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్‌ గడువు..22 వరకు ఎడిట్‌ ఆప్షన్‌

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2024 | 07:11 AM