ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రూ.229 కోట్ల భారీ మోసం.. ఎలా జరిగిందంటే..

ABN, Publish Date - Oct 11 , 2024 | 10:38 AM

‘లక్ష పెట్టుబడి పెడితే బేసిక్‌ స్కీమ్‌ కింద 15 శాతం ప్రాఫిట్‌తో మూడు నెలల్లో రూ. 1.15 లక్షలు, ఆరు నెలల్లో గోల్డెన్‌ స్కీమ్‌ కింద రూ. 1.25 లక్షలు, 12 నెలలకు ప్లాటినం స్కీమ్‌ కింద 60 శాతం ప్రాఫిట్‌తో రూ. 1.60 లక్షలు, 24 నెలలకు ఆర్బిట్‌ స్కీమ్‌ కింద 100 శాతం ప్రాఫిట్‌తో రెట్టింపు డబ్బులు అంటే 2 లక్షలు అందిస్తాం’ అంటూ బురిడీ కొట్టించారు డీకేజెడ్‌ టెక్నాలజీస్‌ నిర్వాహకులు.

- అత్యధిక లాభాలంటూ డీకేజెడ్‌ టెక్నాలజీస్‌ బురిడీ

- 17,500 మందిని దగా చేసిన కేటుగాళ్లు

- యూట్యూబ్‌ వీడియోలకు ఆకర్శితులై.. కోట్లు పెట్టుబడులు పెట్టిన బాధితులు

- డైరెక్టర్‌, ప్రొప్రయిటర్‌ అరెస్టు

హైదరాబాద్‌ సిటీ: ‘లక్ష పెట్టుబడి పెడితే బేసిక్‌ స్కీమ్‌(Basic scheme) కింద 15 శాతం ప్రాఫిట్‌తో మూడు నెలల్లో రూ. 1.15 లక్షలు, ఆరు నెలల్లో గోల్డెన్‌ స్కీమ్‌ కింద రూ. 1.25 లక్షలు, 12 నెలలకు ప్లాటినం స్కీమ్‌ కింద 60 శాతం ప్రాఫిట్‌తో రూ. 1.60 లక్షలు, 24 నెలలకు ఆర్బిట్‌ స్కీమ్‌ కింద 100 శాతం ప్రాఫిట్‌తో రెట్టింపు డబ్బులు అంటే 2 లక్షలు అందిస్తాం’ అంటూ బురిడీ కొట్టించారు డీకేజెడ్‌ టెక్నాలజీస్‌ నిర్వాహకులు. సుమారు 17,500 మందిని మోసం చేసి రూ.229 కోట్లు కొల్లగొట్టి భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన కేటుగాళ్ల ఆటకట్టించారు సిటీ సీసీఎస్‌ పోలీసులు. సీసీఎస్‌ డీసీపీ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వక్‌ రహీల్‌ డైరెక్టర్‌గా, ఆయన భార్య సయీదా అయేశానాజ్‌ ప్రొప్రయిటర్‌గా మాదాపూర్‌లో డీకేజెడ్‌ టెక్నాలజీస్/డికాజో సొల్యూషన్స్‌ ప్రై. లిమిటెడ్‌ పేరుతో సంస్థను ప్రారంభించారు.

ఈ వార్తను కూడా చదవండి: Dussehra: హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ.. ఎందుకంటే


మాదాపూర్‌(Madapur)లో డికాజో, చాదర్‌ఘాట్‌లో అర్లీ ఫ్రష్‌ స్టోర్‌ ఉన్నాయని, హెడ్‌సెట్స్‌, నెక్‌బ్యాండ్‌ కంపెనీ బోల్ట్‌, అమెజాన్‌తో ఒప్పందాలు చేసుకున్నామని నమ్మించారు. బిటుబి (బిజినెస్‌ టు బిజినెస్‌), బీ టు సి (బిజినెస్‌ టు కస్టమర్‌) వ్యాపారానికి అవకాశం ఉందన్నారు. అమెజాన్‌ నుంచి రోజుకు 4000 ఆర్డర్స్‌ వస్తాయని ప్రచారం చేసుకున్నారు. ప్రత్యేక ఏజెంట్లను నియమించుకోవడంతో పాటు, సోషల్‌మీడియా, యూట్యూబ్‌లలో భారీగా ప్రచారం చేశారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే ప్రారంభంలోనే 8 నుంచి 12 శాతం ప్రాఫిట్స్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.


యూట్యూబ్‌లో ప్రచార వీడియోలకు ఆకర్శితులైన కొందరు మాదాపూర్‌లోని కార్యాలయానికి వచ్చి విచారించేవారు. సంస్థ మేనేజర్లు మహ్మద్‌ ఇక్బాల్‌, సయ్యద్‌ ఉమర్‌ అహ్మద్‌, నజీర్‌, బిలాల్‌ పెట్టుబడుల గురించి, ప్రాఫిట్స్‌ గురించి, సంస్థ ప్రవేశపెట్టిన బేసిక్‌, గోల్డెన్‌, ప్లాటినం, ఆర్బిట్‌ స్కీముల గురించి వివరించేవారు. వాటికి సంబంధించిన బ్రోచర్లను ఇచ్చేవారు. రూ.5000 నుంచి పెట్టుబడులు పెట్టవచ్చని సూచించారు. వారి మాటలను నమ్మిన కస్టమర్లు రూ. కోట్లలో పెట్టుబడులు పెట్టారు.


వెలుగులోకి వచ్చిందిలా..

గుడిమల్కాపూర్‌కు చెందిన డాక్టర్‌ అబ్ధుల్‌ జైష్‌ ఈ ఏడాది జనవరిలో డీకేజెడ్‌ టెక్నాలజీస్/డికాజో సొల్యూషన్స్‌కు సంబంధించిన ఇన్వెస్టిమెంట్‌ ప్లాన్స్‌ వీడియోను యూట్యూబ్‌లో చూశాడు. ఆ స్కీమ్‌లకు ఆకర్శితుడైన జైష్‌.. మాదాపూర్‌లోని సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి వారితో మాట్లాడడంతో పాటు కార్యాలయం హంగూ ఆర్భాటాన్ని, కార్పొరేట్‌ హంగామాను చూసి ముగ్ధుడై కొంత పెట్టుబడి పెట్టాడు. రిటర్న్స్‌ రావడంతో కొద్దినెలలు గడిచిన తర్వాత మరోసారి కార్యాలయానికి వెళ్లి తన వాటాగా రూ.2.74 కోట్లు పెట్టుబడులు పెట్టారు.


సంస్థ నుంచి రిటర్స్న్‌ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీసీఎస్‌ పోలీసులు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 564 ఒరిజినల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ గ్యారెంటీ అగ్రిమెంట్‌ బాండ్లు, డీకేజెడ్‌ టెక్నాలజీస్‌ లోగోతో కూడిన 5 బండిళ్ల లెటర్‌ హెడ్స్‌, వివిధ ఖాతాదారుల పేరుతో ఉన్న చెక్‌బుక్స్‌, 13 ల్యాప్‌టాప్‏లు, రూ.1.70కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు ఇచ్చిన వాంగ్మూలం, డీకేజెడ్‌ టెక్నాలజీస్‌ రికార్డుల పరిశీలన అనంతరం మొత్తం 17,500 మంది నుంచి అక్రమంగా రూ.229 కోట్ల పెట్టుబడులు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.


ఆర్థిక మోసంతో పాటు, తెలంగాణ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేశారు. సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాలతో సీసీఎస్‌ డీసీపీ శ్వేత పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్‌ రంగంలోకి దిగింది. టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో డైరెక్టర్‌, ప్రొప్రయిటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతర మేనేజర్స్‌, ఏజెంట్లు పరారీలో ఉన్నారు. త్వరలోనే వారినీ అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు.


ఇదికూడా చదవండి: Hydra: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2024 | 10:39 AM