Hyderabad: ఓ వాహనం ఢీకొట్టి.. ఆపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లి..
ABN, Publish Date - Dec 04 , 2024 | 07:17 AM
ఓ వాహనం ఢీకొట్టడంతో కిందపడి రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న పాదచారి పైనుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అబ్దుల్లాపూర్‌మెట్(Abdullapurmet) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారు బాటసింగారం వద్ద ఫ్లెఓవర్‌పై గుర్తు తెలియని వ్యక్తి (వయస్సు సుమారు 35) నడుచుకుంటూ వెళ్తున్నాడు.
- గుర్తు తెలియని పాదచారి దుర్మరణం
- మృతుడి వివరాల కోసం పోలీసుల ఆరా
హైదరాబాద్: ఓ వాహనం ఢీకొట్టడంతో కిందపడి రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న పాదచారి పైనుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అబ్దుల్లాపూర్‌మెట్(Abdullapurmet) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారు బాటసింగారం వద్ద ఫ్లెఓవర్‌పై గుర్తు తెలియని వ్యక్తి (వయస్సు సుమారు 35) నడుచుకుంటూ వెళ్తున్నాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad to Vijayawada) వైపు వెళ్తున్న వాహనం అతడిని ఢీకొట్టింది.
ఈ వార్తను కూడా చదవండి: Trains: అయ్యప్ప మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే సూచన.. అదేంటంటే..
దీంతో ఆయన తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా, కొందరు డయల్ 100కు సమాచారం అందించారు. ఇంతలో అదే సమయంలో నగరం నుంచి విజయవాడ(Vijayawada) వైపు వెళ్తున్న మిర్యాలగూడకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డుపై పడిఉన్న అతడిపై నుంచి వెళ్లింది. దీంతో అతడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Read Latest Telangana News and National News
Updated Date - Dec 04 , 2024 | 07:17 AM