ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆహా.. ఏం ఐడియాగురూ.. జీవితంలో స్థిరపడాలని వారెంచుకున్న మార్గం ఏంటో తెలిస్తే..

ABN, Publish Date - Sep 06 , 2024 | 08:30 AM

వారికి పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు. సులభంగా లక్షలు సంపాదించి జీవితంలో స్థిరపడాలని అనుకున్నారు. అందుకు జువెల్లరీ షాపు(Jewelery shop) యజమాని నుంచి డబ్బులు కొట్టేయాలని పథకం వేసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఎయిర్‌ పిస్టల్‌(Air pistol)తో బెదిరించి దారిదోపిడీకి పాల్పడి రూ.48.30 లక్షలు దోచేశారు.

- పిస్టల్‌తో బెదిరించి రూ.48.30 లక్షలు తస్కరణ

- దోపిడీ దొంగల ఆటకట్టించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

- నిందితులంతా 20 ఏళ్లలోపు వారే..

హైదరాబాద్‌ సిటీ: వారికి పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు. సులభంగా లక్షలు సంపాదించి జీవితంలో స్థిరపడాలని అనుకున్నారు. అందుకు జువెల్లరీ షాపు(Jewelery shop) యజమాని నుంచి డబ్బులు కొట్టేయాలని పథకం వేసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఎయిర్‌ పిస్టల్‌(Air pistol)తో బెదిరించి దారిదోపిడీకి పాల్పడి రూ.48.30 లక్షలు దోచేశారు. ఫిర్యాదు అందుకున్న నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కేవలం నాలుగురోజుల్లో పట్టుకొని వారి నుంచి నగదు, ఫోన్లు, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సుధీంద్ర(Task Force DCP Sudhindra) గురువారం ఈ చోరీ వివరాలు వెల్లడించారు. అత్తాపూర్‌ కిషన్‌బాగ్‌కు చెందిన సర్దార్‌ హరిప్రీత్‌సింగ్‌ రిషి, గుర్జిత్‌సింగ్‌రాజ్‌ అన్నదమ్ములు.

ఈవార్త కూడా చదవండి: Hyderabad: కేబీఆర్‌ పార్కు చుట్టూ 6 ఫ్లైఓవర్లు.. 4 సబ్‌వేలు


తల్లిదండ్రులు లేకపోవడంతో ఇంటి కిరాయిలపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌కు చెందిన మహ్మద్‌ గుఫ్రాన్‌లాహీ అలియాస్‌ అబ్బు, కార్వాన్‌కు చెందిన శ్రవణ్‌ క్లాస్‌మేట్స్‌. కొద్దిరోజుల క్రితం హరిప్రీత్‌సింగ్‌ రిషి నాందేడ్‌కు వెళ్లినప్పుడు మన్‌ప్రీత్‌సింగ్‌తో పరిచయం ఏర్పడింది. మన్‌ప్రీత్‌ సింగ్‌ కుటుంబానికి సైతం అప్పులు ఉండటంతో ఏదైనా దోపిడీ చేసి భారీగా డబ్బులు సంపాదించి సెటిల్‌ అయిపోవాలని పథకం వేశారు. ఈ విషయాన్ని అందరూ కలిసి చర్చించుకున్నారు. శ్రవణ్‌ తాను గతంలో పనిచేసిన జువెల్లరీ దుకాణ యజమాని గురించి చెప్పాడు.


పథకం ప్రకారం దోపిడీ..

శ్రవణ్‌ గతంలో తిబరుమల్‌ జువెల్లరీ దుకాణం బంజారాహిల్స్‌ శాఖలో పనిచేయడంతో అక్కడి వ్యవహారాలన్నీ తెలుసు. ఆ వివరాలన్నీ మిత్రులకు చెప్పాడు. దీంతో దుకాణ యజమాని నుంచి ఎలాగైనా నగదును కొట్టేయాలని భావించి హరిప్రీత్‌సింగ్‌ తన బంధువైన గురుప్రీత్‌సింగ్‌ వద్ద ఎయిర్‌ పిస్టల్‌ తీసుకున్నాడు. అనుకున్న ప్లాన్‌ ప్రకారం.. గతనెల 30న దుకాణ యజమాని డబ్బంతా సర్దుకొని బ్యాగులో పెట్టుకొని మరో వ్యక్తితో కలిసి హోండాయాక్టివాపై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో పాన్‌షాప్ వద్ద ఆగారు. దుకాణ యజమాని షాప్‌ వద్దకెళ్లగా డబ్బు సంచితో మరోవ్యక్తి వాహనంపై ఉన్నారు.


ఇదే అదనుగా భావించి హరిప్రీత్‌సింగ్‌, మన్‌ప్రీత్‌సింగ్‌ పిస్టల్‌తో బెదిరించి రెప్పపాటులో డబ్బుల బ్యాగ్‌తో పరారయ్యారు. దోచుకున్న డబ్బుతో నిందితులు రూ.4.50 లక్షలు వెచ్చించి మూడు యాపిల్‌ ఐఫోన్లు కొనుగోలు చేశారు. దోపిడీ జరిగిన వెంటనే బాధితుడు గుడిమాల్కాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు(Task Force Police) సాంకేతిక ఆధారాలతో ఐదుగురిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. చాకచక్యంగా దోపిడీ దొంగలను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌, గుడిమల్కాపూర్‌ పోలీసులను సీపీ అభినందించినట్టు డీసీపీ సుధీంద్ర తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 06 , 2024 | 08:30 AM

Advertising
Advertising