ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మత్తు డాక్టర్‌ ఆత్మహత్య..

ABN, Publish Date - Jul 07 , 2024 | 12:06 PM

నిమ్స్‌లోని అనస్తీషియా విభాగంలో అడిషనల్‌ ప్రొఫెసర్‌(Additional Professor)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ప్రాచీకార్‌(46) ఎక్కువ మోతాదులో మత్తుమందు తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బేగంపేట ఎస్సై జయచందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్రాచీకార్‌ భర్త దీపక్‌ కార్డియాలజిస్టుగా పని చేస్తున్నారు.

హైదరాబాద్: నిమ్స్‌లోని అనస్తీషియా విభాగంలో అడిషనల్‌ ప్రొఫెసర్‌(Additional Professor)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ప్రాచీకార్‌(46) ఎక్కువ మోతాదులో మత్తుమందు తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బేగంపేట ఎస్సై జయచందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్రాచీకార్‌ భర్త దీపక్‌ కార్డియాలజిస్టుగా పని చేస్తున్నారు. వీరికి 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఒక కుమారుడు ఉన్నాడు. బేగంపేట(Begumpet)లోని బ్రాహ్మణవాడిలో సొంత ఇంట్లో ఉన్న వీరు నెల రోజుల క్రితం మూసాపేటలోని మరో ఇంటికి మారారు. శుక్రవారం సాయంత్రం ఆమె విధులు ముగించుకొని బ్రాహ్మణవాడిలోని ఇంటికి వెళ్లి మత్తు ఇంజక్షన్‌ తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మాదాపూర్‌లో 7.8 మి.మీ వర్షం..


ఎంత సేపటికి ఇంటికి రాక పోవడంతో భర్త ఆమెకు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. దీంతో భర్త బ్రాహ్మణవాడిలోని ఇంటికి వెళ్లి చూడగా ఇంటి లోపల నుంచి తలుపునకు గడియపెట్టి ఉంది. తలుపు పగులగొట్టి చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే చికిత్స కోసం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 12:06 PM

Advertising
Advertising
<