ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బ్యాంక్‌ మేనేజర్‌ చేతివాటం.. 4.80 కోట్లకు టోకరా

ABN, Publish Date - Nov 08 , 2024 | 07:16 AM

నకిలీపత్రాలతో రుణాలు మంజూరు చేసి రూ.4.80 కోట్లు స్వాహా చేసిన కేసులో మరో 8 మంది నిందితులను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆర్నెళ్ల కిందట సనత్‌నగర్‌ ఎస్‌బీఐ మేనేజర్‌ కార్తీక్‌రాయ్‌(Sanatnagar SBI Manager Karthik Roy)ను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు.

- 5% కమీషన్‌ తీసుకొని నకిలీ పత్రాలతో రుణాలు

- చనిపోయిన వారి ఖాతాల్లోనూ డబ్బు కాజేత

- గతంలో మేనేజర్‌.. తాజాగా మరో 8 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: నకిలీపత్రాలతో రుణాలు మంజూరు చేసి రూ.4.80 కోట్లు స్వాహా చేసిన కేసులో మరో 8 మంది నిందితులను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆర్నెళ్ల కిందట సనత్‌నగర్‌ ఎస్‌బీఐ మేనేజర్‌ కార్తీక్‌రాయ్‌(Sanatnagar SBI Manager Karthik Roy)ను స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెద్ద మొత్తంలో మోసం జరగినట్లు గుర్తించి కేసును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేసిన ఈవోడబ్ల్యూ అధికారులు బ్యాంకు మేనేజర్‌తోపాటు మరికొందరు కలిసి ముఠాగా ఏర్పడి భారీస్థాయిలో మోసం చేసినట్లు గుర్తించారు.

ఈ వార్తను కూడా చదవండి: KTR : జైలుకెళ్లేందుకు నేను సిద్ధం


నకిలీ ధ్రువపత్రాలతో రుణం తీసుకున్న వారితోపాటు నకిలీపత్రాలు సమకూర్చిన వారిని అరెస్ట్‌ చేశారు. వీరంతా బ్యాంకు మేనేజర్‌ కార్తీక్‌రాయ్‌తో కలిసి మోసానికి పాల్పడ్డారని, నకిలీపత్రాలతో రుణాన్ని మంజూరు చేసినందుకు బ్యాంకు మేనేజర్‌ 5 శాతం కమీషన్‌ తీసుకునేవాడని దర్యాప్తులో తేలింది. తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఉద్యోగుల పేరుతో నకిలీపత్రాలు, పేస్లిప్పులతో మట్టేపల్లి శ్రీశాంత్‌ రూ.15 లక్షలు, పోలె విశాల్‌ మరో రూ.15 లక్షల చొప్పున రుణం తీసుకున్నారు. వీరికి నకిలీపత్రాలు సమకూర్చడంలో దాగల రాజు, శుధాంశు శేఖర్‌ పరిదా, ఎండీ వాజిద్‌, సునీల్‌కుమార్‌, భాస్కర్‌గౌడ్‌, ఆమంచి ఉపేందర్‌ సహకరించారని గుర్తించారు. వీరంతా 2022 నుంచి 2023 వరకు రూ.4.80 కోట్లు కాజేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.


చనిపోయిన వారి ఖాతాల్లో డబ్బు కూడా..

కార్తీక్‌రాయ్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి పలుమార్గాల్లో డబ్బు కాజేశాడు. బ్యాంకు ఖాతాదారులకు తెలియకుండా వారి లోన్‌పై టాప్‌అప్‌ తీసుకొని, ఇతర ఖాతాలకు మళ్లించాడు. ఖాతాదారుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సొమ్మును వేరే ఖాతాలకు బదిలీ చేశాడు. బ్యాంకు ఖాతాదారులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులకు తెలియకుండా ఖాతాలో డబ్బు కాజేసేవాడు. బ్యాంకు కు వచ్చిన ఖాతాదారులకు మ్యూచువల్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే పెద్దమొత్తాల్లో లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడి పేరుతో డబ్బులు వసూలు చేసి సొంత ఖాతాలో జమ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.


ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్‌ నుంచి నగరానికి హెరాయిన్‌.. ఐటీ కారిడార్‌లో విక్రయం

ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2024 | 07:16 AM