ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బంతి కోసం దిగి.. నాలాలో బాలుడి గల్లంతు

ABN, Publish Date - Dec 14 , 2024 | 09:47 AM

నాలాలో బాలుడు గల్లంతయ్యాడు. ఫతేనగర్‌ డివిజన్‌ ఇందిరాగాంధీపురం(Indira Gandhipuram)లో నివసిస్తున్న షేక్‌ మోసిన్‌ కుమారుడు షేక్‌ ముజామిల్‌(7) శుక్రవారం సాయంత్రం ఈద్గా మైదానంలో క్రికెట్‌(Cricket) ఆడుతున్నాడు.

హైదరాబాద్: నాలాలో బాలుడు గల్లంతయ్యాడు. ఫతేనగర్‌ డివిజన్‌ ఇందిరాగాంధీపురం(Indira Gandhipuram)లో నివసిస్తున్న షేక్‌ మోసిన్‌ కుమారుడు షేక్‌ ముజామిల్‌(7) శుక్రవారం సాయంత్రం ఈద్గా మైదానంలో క్రికెట్‌(Cricket) ఆడుతున్నాడు. బాల్‌ నాలాలో పడడంతో తీసుకొచ్చేందుకు వెళ్లి అక్కడే ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి నాలాలో కొట్టుకోయాడని స్థానికులు చెబుతున్నారు. కుమారుడు నాలాలో గల్లంతవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సీఎం రేవంత్‏కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..


డీఆర్‌ఎఫ్‌ బృందాల గాలింపు..

సమాచారం అందుకున్న బాలానగర్‌ ఏసీపీ హనుమంతరావు(Balanagar ACP Hanumantha Rao), సనత్‌నగర్‌ సీఐ, ఫైర్‌ సిబ్బంది రాజు, మిరాజొద్దీన్‌, ఎల్లయ్య, సురేష్‌, నవీన్‌కుమార్‌, డీఆర్‌ఎఫ్‌ బృందాలు నాలాలో బాలుడి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. నాలాలో పడి గల్లంతయిన బాలుడు బేగంపేట(Begumpet) నాలా వద్ద తేలే అవకాశం ఉండొచ్చని రెండు అత్యవసర బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మూసాపేట సర్కిల్‌(Moosapet Circle) అధికారులు ఈద్గా ప్రహరీ కూల్చి నాలాలో పూడికతీత పనులు చేపట్టారని, పనులు పూర్తయి ఏడాది అయినా ప్రహరీ నిర్మించకపోవడంతోనే బాలుడు నాలాలో పడి గల్లంతయ్యాడని, దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు మండిపడుతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2024 | 09:47 AM