ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: భక్తుడిగా వచ్చి.. ఆలయంలో చోరీ..

ABN, Publish Date - Jul 05 , 2024 | 11:12 AM

భక్తుడిలా ఆలయంలో ప్రవేశించిన దుండగుడు ఆలయంలో చోరీ చేసిన సంఘటన నాగోల్‌ పోలీస్‏స్టేషన్‌(Nagol Police Station)లో జరిగింది. నాగోల్‌ జైపూర్‌కాలనీ షిరిడీ సాయిబాబా ఆలయంలో భక్తుడిగా వచ్చిన వ్యక్తి ఎవరూ గమనించని సమయంలో వెండి సామగ్రి ఎత్తు కెళ్లాడు.

- నాగోల్‌ జైపూర్‌ కాలనీ షిరిడీ సాయిబాబా ఆలయంలో ఘటన

హైదరాబాద్: భక్తుడిలా ఆలయంలో ప్రవేశించిన దుండగుడు ఆలయంలో చోరీ చేసిన సంఘటన నాగోల్‌ పోలీస్‏స్టేషన్‌(Nagol Police Station)లో జరిగింది. నాగోల్‌ జైపూర్‌కాలనీ షిరిడీ సాయిబాబా ఆలయంలో భక్తుడిగా వచ్చిన వ్యక్తి ఎవరూ గమనించని సమయంలో వెండి సామగ్రి ఎత్తు కెళ్లాడు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం జైపురి కాలనీలోని షిరిడీ సాయిబాబా(Shirdi Saibaba) ఆలయానికి దుండగుడు భక్తుడిలా వచ్చాడు. గురువారం భక్తులు ఎక్కువగా రావడంతో అందరూ వెళ్లిపోయే వరకు అక్కడే ఉన్నాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా సారూ..


భక్తులు అందరు వెళ్లిపోయిన తర్వాత అతడు లోపలికి వెళ్లి రూ 40 వేల విలువ చేసే వెండి దీపపు సమ్మెలు, ఇతర వెండి సామగ్రిని బ్యాగులో వేసుకుని వెళ్లిపోయాడు. సాయి సంస్థాన్‌ ప్రతినిధులు గమనించి సీసీ కెమెరాలు పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ కొలను వెంకట్‌రెడ్డి, కార్యదర్శి గుండా సోమయ్య, కోశాధికారి రంజిత్‌గౌడ్‌ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 11:12 AM

Advertising
Advertising