Hyderabad: మల్లారెడ్డి ఆస్పత్రిపై కేసు నమోదు
ABN, Publish Date - Nov 21 , 2024 | 10:22 AM
మల్లారెడ్డి ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా, నారాయణపేట్(Narayanpet) మండలం, సాతూరుపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు భార్య రాగి చిన్నవలోల్ల లక్ష్మి (48)ను అనారోగ్యంతో ఆగస్టు 31న సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు.
- చికిత్స పొందుతూ మహిళ మృతి చెందడంపై ఫిర్యాదు
- ఆలస్యంగా సమాచారం అందించారని కుమార్తె ఆరోపణ
హైదరాబాద్: మెదక్ జిల్లా, నారాయణపేట్(Narayanpet) మండలం, సాతూరుపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు భార్య రాగి చిన్నవలోల్ల లక్ష్మి (48)ను అనారోగ్యంతో ఆగస్టు 31న సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు. అయితే వైద్య పరీక్షలు చేసిన బ్రెయిన్ స్పెషల్‌లిస్ట్ డాక్టర్ ఆమె మెడలో ఒక నరం తెగిపోయిందని, ఆపరేషన్ చేస్తే నయమవుతుందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. చికిత్స నిమిత్తం మొదటగా రూ. 25 వేలను మహిళ కుటుంబ సభ్యులు చెల్లించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురి అరెస్ట్
సెప్టెంబరు 3న ఆపరేషన్ డాక్టర్లు ఆపరేషన్ సక్సెస్ అయిందని తెలిపారు. రెండు రోజులు అబ్జర్వేషన్ కోసమని వెంటిలేటర్‌పై ఉంచారు. అనంతరం 6న మరోసారి పేషెంట్‌కు బ్రెయిన్ స్కాన్ చేసిన డాక్టర్ మహిళ కుటుంబ సభ్యులతో ఆమె ఆరోగ్యం బాగాలేదని, కోలుకోవడానికి శరీరం సహకరించడం లేదని తెలిపారు. మరలా 10వ తేదీన వైద్యులు కుటుంబ సభ్యులను పిలిపించి, 9వ తేదీ ఉదయాన్నే మహిళకు స్ర్టోక్ వచ్చిందని, పరిస్ధితి కష్టమని, ఆమెను ఇంటికి తీసుకువెళ్లమని, అయితే రూ.78 వేలు చెల్లించి తీసుకువెళ్లాలని చెప్పారు.
9వ తేదీ మహిళకు స్ర్టోక్ వస్తే, 10న తెలపడం ఏమిటని డాక్టర్‌ను కుటుంబ సభ్యులు నిలదీశారు. అనంతరం మెడికల్ రిపోర్టు ఏమి ఇవ్వకుండా, కాగితంపై సంతకం తీసుకొని, తీసుకువెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది అనుమతించారు. ఆమెను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తీసుకువెళుతున్న క్రమంలో సిబ్బంది పరీక్షించి, మహిళకు పల్స్ లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు స్వగ్రామానికి ఆమెను తీసుకువెళ్లి దహన కార్యక్రమాలను నిర్వహించారు.
మహిళ కుమార్తె అశ్విని ఈ నెల 18న ఆపరేషన్ చేసిన రోజే తన తల్లి చనిపోయిందని, అయినా వెంటీలేటర్‌పై ఉంచి, చికిత్స చేస్తున్నామని మభ్యపెట్టి, వైద్యం చేశారని సూరారం పోలీస్‌స్టేషన్‌లో ఆస్పత్రిపై ఫిర్యాదు చేసింది. దాంతోపాటు మల్లారెడ్డి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విషయంపై సీఐ భరత్ కుమార్ మాట్లాడుతూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, తహశీల్దార్, వైద్యుల సమక్షంలో పూడ్చిన శవానికి పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్ గడువు..22 వరకు ఎడిట్ ఆప్షన్
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 21 , 2024 | 10:22 AM