Hyderabad: అమ్మకానికి చిన్నారి.. ఆర్‌ఎంపీ డాక్టర్ అరెస్ట్
ABN, Publish Date - May 23 , 2024 | 10:40 AM
ముక్కుపచ్చలారని నెలల చిన్నారిని అమ్మకానికి పెట్టిన మహిళా ఆర్‌ఎంపీ డాక్టర్‌తో పాటు.. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారిని కాపాడిన పోలీసులు శిశువిహార్(Shishuvihar) అధికారులకు అప్పగించారు.
- శిశువిహార్‌కు చిన్నారి తరలింపు
హైదరాబాద్: ముక్కుపచ్చలారని నెలల చిన్నారిని అమ్మకానికి పెట్టిన మహిళా ఆర్‌ఎంపీ డాక్టర్‌తో పాటు.. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారిని కాపాడిన పోలీసులు శిశువిహార్(Shishuvihar) అధికారులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ పరిధిలోని రామకృష్ణనగర్‌లో శోభారాణి(Shobharani) ఆర్‌ఎంపీగా పనిచేస్తూ.. ఫస్ట్‌ఎయిడ్ సెంటర్‌ను నడుపుతోంది. పిల్లలు అవసరమైన వారికి రూ.4లక్షలకు చిన్నారిని విక్రయిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఇటీవల అడ్వాన్స్‌గా రూ.10వేలు చెల్లించారు. బుధవారం చిన్నారి కోసం రాగా.. మిగిలిన డబ్బులు తీసుకొని చిన్నారిని విక్రయించడానికి శోభారాణి సిద్ధంగా ఉంది.
ఇదికూడా చదవండి: Hyderabad: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ మోసం...
అదే సమయంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు రంగంలోకి దిగి చిన్నారిని విక్రయిస్తున్న నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశువిహార్ అధికారులకు అప్పగించారు. గత కొంతకాలంగా చిన్నారులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఆర్‌ఎంపీపై నిఘా పెట్టిన ఎన్జీవో ప్రతినిధులు పిల్లలు కావాలని ఆమెను నమ్మించి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ఆర్‌ఎంపీ శోభారాణి ఇప్పటి వరకు ఎంతమంది చిన్నారులను విక్రయించింది..? వారిని ఎక్కడి నుంచి తెస్తోంది..? బుధవారం విక్రయానికి పెట్టిన చిన్నారి తల్లిదండ్రులు ఎవరు..? అనే దానిపై విచారణ చేస్తున్నారు. ఆర్‌ఎంకి సహకరించిన షేక్ సలీంపాషా, చింత స్వప్నలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 23 , 2024 | 10:40 AM