Hyderabad: కాకాగూడలో కలకలం.. మూడు మూగజీవాలపై కట్టర్‌లతో దాడి
ABN, Publish Date - Jul 03 , 2024 | 11:25 AM
గంజాయి మద్యం మత్తులో ఓ యువకుడు మూడు మూగజీవాల(ఆవుల)పై కట్టర్ చాకుతో దాడిచేసిన సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్(Karkhana Police Station) పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కాకాగూడలో నివాసముంటున్న హరీష్ (23) ఎనిమిది కేసుల్లో పాత నేరస్థుడు.
- గంజాయి మత్తులో క్రూరత్వం
- యువకుడి అరెస్ట్
హైదరాబాద్: గంజాయి మద్యం మత్తులో ఓ యువకుడు మూడు మూగజీవాల(ఆవుల)పై కట్టర్ చాకుతో దాడిచేసిన సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్(Karkhana Police Station) పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కాకాగూడలో నివాసముంటున్న హరీష్ (23) ఎనిమిది కేసుల్లో పాత నేరస్థుడు. జులాయిగా తిరుగుతూ గంజాయికి అలవాటుపడ్డాడు. గంజాయి మత్తులో ఉన్న హరీష్ సోమవారం అర్ధరాత్రి దాటాక కార్ఖానా కాకాగూడలోని వీరాంజనేయస్వామి దేవాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న మూడు ఆవులపై కట్టర్ చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఒక ఆవు ముఖంపై, మరొక ఆవు వెనుక భాగం తొడపె, మూడో ఆవు కడుపుపై చాకుతో తీవ్రగాయంచేశాడు. సోమవారం ఉదయం కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిక్షపతి కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెటర్నరీ వైద్యులకు సమాచారం అందించారు.
ఇదికూడా చదవండి: Nizamabad: బీరు బాటిల్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు..
ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని బోయగూడలోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి మెరుగైన చికిత్సను అందించారు. సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. దాడిచేసిన వ్యక్తి హరీ్‌షను అరెస్టు చేశారు. ఇతనిపై 325బి ఎన్‌ఎ్‌ససెక్షన్ 11 ఎనిమినల్స్ క్యూరియల్లీ యాక్ట్ సెక్షన్లు నమోదు చేసినట్లు కార్ఖానా పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కార్ఖానా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ రామకృష్ణకు సూచించారు. ఆవులపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు డా.వంశతిలక్, విజయానంద్‌లు కోరారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 03 , 2024 | 11:28 AM