ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మానసిక ఒత్తిడితో.. వైద్యురాలి ఆత్మహత్య

ABN, Publish Date - Jul 05 , 2024 | 09:36 AM

మానసిక ఒత్తిడితో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు ప్పాడింది. నాగోలు ఎస్‌హెచ్‌ఓ సుధీర్‌ కృష్ణ(Nagolu SHO Sudhir Krishna) తెలిపిన వివరాల ప్రకారం.. మధుసూదన్‌రావు విశ్రాంత ఉద్యోగి. ఆయన, భార్య నిరుపమారావు బండ్లగూడ రాజీవ్‌ స్వగృహ అపార్ట్‌మెంట్స్‌ 8వ అంతస్తులో ఉంటున్నారు.

హైదరాబాద్: మానసిక ఒత్తిడితో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు ప్పాడింది. నాగోలు ఎస్‌హెచ్‌ఓ సుధీర్‌ కృష్ణ(Nagolu SHO Sudhir Krishna) తెలిపిన వివరాల ప్రకారం.. మధుసూదన్‌రావు విశ్రాంత ఉద్యోగి. ఆయన, భార్య నిరుపమారావు బండ్లగూడ రాజీవ్‌ స్వగృహ అపార్ట్‌మెంట్స్‌ 8వ అంతస్తులో ఉంటున్నారు. వారి కుమార్తె డాక్టర్‌ నిహారికారావు(29) ఏఎస్‌ రావునగర్‌లో ఉండేది. అక్కడే ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తుండేది. పీజీ ఎంట్రెన్స్‌ పరీక్షకు ప్రిపేరయ్యేది. ఆమె భర్త మనోహర్ష ఢిల్లీలో ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నారు. ఇటీవలే ఆమె తలిదండ్రుల వద్దకు వచ్చింది. కరోనా రోజుల నుంచీ ఆమె తరచూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఇదివరకే ఆమె రెండు మార్లు ఆత్మహత్యకు యత్నించింది. తల్లిదండ్రులు వైద్య నిపుణులకు చూపించారు. గురువారం ఉదయం 10.30కు తండ్రి మధుసూదన్‌రావు(Madhusudan Rao) పనిమీద బయటకు వెళ్లారు.

ఇదికూడా చదవండి: BJP leader: బీజేపీ నేత అరెస్ట్‌.. కారణం ఏంటంటే...


ఇంట్లో తల్లి నిరుపమారావు పనిలో నిమగ్నమై ఉన్నారు. 11 గంటలకు నిహారికరావు తాముంటున్న 8వ అంతస్తుపై నుంచి కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకుంది. శబ్దం రావడంతో తల్లి బయటకు వచ్చి చూడగా కుమార్తె రక్తపు మడుగులో కనిపించింది. గ్రౌండ్‌ఫ్లోర్‌కు వెళ్లి చూసేసరికి ఆమె మృతి చెందింది. అప్పడే బయట నుంచి వచ్చిన మధుసూదన్‌రావు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. ఒక్కగానొక్క కూతురు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడడం ఆ వృద్ధ దంపతులను కలచివేసింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 09:36 AM

Advertising
Advertising