ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఏడాదిగా ఆగని వరకట్న వేధింపులు.. మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య

ABN, Publish Date - Jul 02 , 2024 | 11:19 AM

పెళ్లై ఏడాది గడిచినా అదనపు కట్నం కావాలని భర్త, అత్తమామలు వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన వివాహిత ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌(Jawaharnagar Police Station) పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్: పెళ్లై ఏడాది గడిచినా అదనపు కట్నం కావాలని భర్త, అత్తమామలు వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన వివాహిత ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌(Jawaharnagar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ చిట్టినగర్‌కు చెందిన వేముల శ్రావణి (23)కి నాగులపంచ హేమసుందర్‌తో 2023లో వివాహం జరిగింది. వృత్తి రీత్యా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో దమ్మాయిగూడ(Dammaiguda) లోని ఎమ్‌ఎల్‌ఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: తనను కాదని.. మరొకరితో చనువుగా ఉంటోందని..


పెళ్లి సమయంలో కట్నకానుకలతో పాటు కొంతనగదు కూడా హేమసుందర్‌కు అందజేశారు. అయినప్పటికీ దుకాణం పెట్టుకుంటామని అదనపు కట్నం కావాలంటూ భర్త శ్రావణిని వేధించడం ప్రారంభించాడు. పెళ్లై ఏడాది గడిచినా పిల్లలు పుట్టడంలేదన్న నెపంతో అత్తమామాలు మానసికంగా వేధిస్తుండటంతో శ్రావణి మనస్తాపం చెందింది. దీంతో గదిలో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 11:19 AM

Advertising
Advertising