ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తాగి నడిపారు.. జైలుకెళ్లారు

ABN, Publish Date - Jul 28 , 2024 | 10:48 AM

హైదరాబాద్‌ కమిషనరేట్‌(Hyderabad Commissionerate) పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన వారిలో 158 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈనెల 12 నుంచి 26వ తేదీ వరకు 15 రోజులపాటు పోలీసులు తనిఖీలు చేపట్టగా 2,483 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.

- రూ.34 లక్షల జరిమానా

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ కమిషనరేట్‌(Hyderabad Commissionerate) పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన వారిలో 158 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈనెల 12 నుంచి 26వ తేదీ వరకు 15 రోజులపాటు పోలీసులు తనిఖీలు చేపట్టగా 2,483 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 1543 మందిపై చార్జ్‌షీట్‌ నమోదు చేసి వివిధ కోర్టుల్లో హాజరుపరిచారు. పట్టుబడిన 158 మందికి ఒకరోజు నుంచి 15 రోజుల వరకు జైలుశిక్షను విధించాయి. 12 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లను 3 నుంచి 6 నెలలపాటు సస్పెండ్‌ చేయడంతోపాటు రూ.34.02 లక్షల జరిమానా విధించింది. జైలు శిక్ష పడిన వారిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన వారు 70 మంది ఉన్నారని అదనపు సీపీ (ట్రాఫిక్‌) విశ్వప్రసాద్‌ తెలిపారు.

ఇధికూడా చదవండి: Hyderabad: 10 కిలోల బంగారు బిస్కెట్లు.. ‘వాల్మీకి’ అవినీతి కేసులో నిందితుడి నుంచి స్వాధీనం


...................................................................................

ఈ వార్తను కూడా చదవండి:

............................................................................

Manjira water: 30న మంజీరా నీళ్లు బంద్‌..

- పలుచోట్ల సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌ సిటీ: పటాన్‌చెరు(Patancheru)లోని వాల్యూ జోన్‌ వద్ద జంక్షన్‌ పనుల కారణంగా నగరానికి మంజీరా(Manjira) నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్‌బోర్డు(Waterboard) ప్రకటించింది. ఈనెల 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపేస్తున్నట్లు తెలిపింది. దీంతో కొన్ని ప్రాంతాలకు పూర్తిగా, మరికొన్ని ప్రాంతాలకు పాక్షికంగా సరఫరా నిలిచిపోతుందని పేర్కొంది. ప్రధానంగా బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌(BHEL TOWNSHIP), హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, పటాన్‌చెరు ఇండస్ర్టియల్‌ ఏరియా, పటాన్‌చెరు పట్టణం, రామచంద్రాపురం, అశోక్‌నగర్‌, జ్యోతినగర్‌, లింగంపల్లి, చందానగర్‌, గంగారం, మదీనాగూడ(Jyotinagar, Lingampally, Chandanagar, Gangaram, Medinaguda), హఫీజ్‌పేట, డోయెన్స్‌ కాలనీ, ఎస్‌బీఐ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తుతుందని సూచించింది.


ఇదికూడా చదవండి: Godavari: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 28 , 2024 | 10:48 AM

Advertising
Advertising
<