ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మలక్‌పేట మెట్రో స్టేషన్‌ కింద అగ్నిప్రమాదం

ABN, Publish Date - Dec 07 , 2024 | 07:03 AM

మలక్‌పేట మెట్రో స్టేషన్‌(Malakpet Metro Station) కింద అగ్ని ప్రమాదం జరిగింది. పార్క్‌ చేసిన ఐదు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. మెట్రో స్టేషన్‌ కింద పాదచారుల బాటలో వాహనాలను పార్క్‌ చేస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు తమ బైక్‌లను పార్క్‌ చేసి వెళ్లిపోయారు.

- పార్క్‌ చేసిన ఐదు బైక్‌లు దగ్ధం

హైదరాబాద్: మలక్‌పేట మెట్రో స్టేషన్‌(Malakpet Metro Station) కింద అగ్ని ప్రమాదం జరిగింది. పార్క్‌ చేసిన ఐదు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. మెట్రో స్టేషన్‌ కింద పాదచారుల బాటలో వాహనాలను పార్క్‌ చేస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు తమ బైక్‌లను పార్క్‌ చేసి వెళ్లిపోయారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో బైక్‌లకు మంటలంటుకున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య..


మంటలు ఎగసిపడడం, దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసరాల్లోని ప్రజలు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనాలు కాలిపోయాయి. దగ్ధమైన వాహనాల్లో రెండు యాక్టివాలు, రెండు పల్సర్‌ బైక్‌లు, స్ల్పెండర్‌ బైక్‌ ఉన్నాయి. ఈ ఘటనతో మలక్‌పేట్‌-దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.


చాదర్‌ఘాట్‌(Chadarghat) పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని గుర్తించారు. అతడు ఎవరు అనే విషయమై ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలో బైక్‌ల నుంచి పెట్రోల్‌ తీసి నింపే డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుక్నుట్లు తెలిసింది.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్‌ రెడ్డి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 07 , 2024 | 07:03 AM