ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ఐదు రోజుల్లో నాలుగు చోరీలు.. నగరంలో దోపిడీ దొంగలు

ABN, Publish Date - May 21 , 2024 | 09:46 AM

వరుస దొంగతనాలు నగరంలో కలకలం రేపుతున్నాయి. హబీబ్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌(Habibnagar Police Station) పరిధిలో ఈనెల 15న దోపిడీ దొంగలు వేర్వేరు ఇళ్లలోకి చొరబడి తాళాలు పగులగొట్టి 15.5 తులాల బంగారం, 5.70 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.

- రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్‌ బృందాలు

- లోకల్‌ గ్యాంగ్‌లా.. అంతర్రాష్ట్ర ముఠాలా?

నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లల్లో అర్ధరాత్రి చొరబడి దోచుకుంటున్నారు.ఇటీవల వెలుగులోకి వచ్చిన చోరీలను పరిశీలిస్తే దొంగలు సిటీ కమిషనరేట్‌నే టార్గెట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం ఐదు రోజుల్లో నాలుగు చోరీలు జరగడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌ సిటీ: వరుస దొంగతనాలు నగరంలో కలకలం రేపుతున్నాయి. హబీబ్‌నగర్‌ పోలీస్‏స్టేషన్‌(Habibnagar Police Station) పరిధిలో ఈనెల 15న దోపిడీ దొంగలు వేర్వేరు ఇళ్లలోకి చొరబడి తాళాలు పగులగొట్టి 15.5 తులాల బంగారం, 5.70 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌(Jubilee Hills)లోని ఓ వైద్యుడి ఇంట్లో రూ. 20 లక్షల నగదు చోరీ చేసిన దుండగుడ్ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రాత్రివేళ.. రోడ్డుపైనే..


మహిళల వేషధారణలో...

చుడీదార్‌ ధరించి, స్కార్ఫ్‌ కట్టుకుని అచ్చం మహిళల్లా ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని జెక్‌కాలనీ ఆకృతి అర్కేడ్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో శనివారం చొరబడ్డ దొంగలు అల్మారాలో దాచిన 4 తులాల బంగారు ఆభరణాలు, రూ. లక్ష నగదు, ల్యాప్‌టాప్‌ ఎత్తుకెళ్లారు. చోరీకి పాల్పడింది లోకల్‌ దొంగలా..? అంతర్రాష్ట్ర దొంగలా..? పురుషులా..? మహిళలా అనేది తెలియడం లేదు. నగరంలో ఈ తరహా వేషధారణలో దొంగలు చోరీకి పాల్పడటం ఇదే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు. పథకం ప్రకారం చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఎస్‌ఆర్‌నగర్‌, పంజాగుట్ట(SR Nagar, Panjagutta) పరిధిలోని అపార్టుమెంట్లలో తాళం వేసిన ఫ్లాట్లను లక్ష్యంగా చేసుకుంటున్న దొంగలు ఏటా వేసవిలోనే చోరీలకు పాల్పడుతుండటం గమనార్హం. రెక్కీ చేసిన తర్వాతే చోరీలకు పాల్పడుతున్నారు.


ఏడాది క్రితం ఇదే తరహాలో..

ఏడాది క్రితం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ అపార్టుమెంట్‌లో ఇదే తరహా చోరీ జరిగింది. ఓ మహిళ.. యజమానురాలిని నమ్మించి పనిలో చేరింది. మరుసటి రోజు ఇంటి యజమానులు పనిమీద బయటకు వెళ్లగా ఇంట్లో ఉన్న వృద్ధుల కళ్లలో కారం చల్లి 150 తులాల బంగారం, వజ్రాభరణాలతో పారిపోయింది. చోరీకి పాల్పడింది అంతర్‌రాష్ట్ర మహిళా దొంగగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని 120 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చి నగరంలో తిష్టవేసిన మహిళలు పని మనుషుల పేరుతో పలు అపార్టుమెంట్స్‌ తిరుగుతూ అందినకాడికి దోచుకుని ఉడాయిస్తున్నట్లు విచారణలో నిగ్గు తేల్చారు. ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఇదే తరహా చోరీలు జరిగినట్లు.. పని మనుషుల పేరుతో ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. నగరంలో వరుస చోరీలు వెలుగులోకి వస్తుండటంతో పోలీస్‌ ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్స్‌, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 21 , 2024 | 09:46 AM

Advertising
Advertising