ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: విదేశీ వీసా, పెట్టుబడుల పేరుతో మోసం

ABN, Publish Date - Aug 22 , 2024 | 01:30 PM

వీసా కన్సల్టెన్సీ ముసుగులో విద్యార్థులను, వ్యాపారంలో లాభాలు ఇస్తానంటూ పలువురిని మోసం చేసిన నిందితుడిపై బాధితులు సీసీఎస్‏లో ఫిర్యాదు చేశారు. నిందితుడు రూ.1.12 కోట్లు తీసుకొని కెనడా(Canada) పరారయ్యాడని, కెనడాలో ఉంటున్న నిందితుడికి అతడి కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

- రూ.1.12 కోట్లతో కెనడాకు పరారీ

- సీసీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు

హైదరాబాద్‌ సిటీ: వీసా కన్సల్టెన్సీ ముసుగులో విద్యార్థులను, వ్యాపారంలో లాభాలు ఇస్తానంటూ పలువురిని మోసం చేసిన నిందితుడిపై బాధితులు సీసీఎస్‏లో ఫిర్యాదు చేశారు. నిందితుడు రూ.1.12 కోట్లు తీసుకొని కెనడా(Canada) పరారయ్యాడని, కెనడాలో ఉంటున్న నిందితుడికి అతడి కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. టౌలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అలీముద్దీన్‌ ఫారూకీ అత్తాపూర్‌ పిల్లర్‌ నం.99 వద్ద ఎన్‌ఏఎఫ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఉమ్రా యాత్రకు వెళ్లేవారికి, విదేశాల్లో చదువుకునేందుకు వీసాలు ఇప్పించేవాడు.


తన సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తానని చెప్పి టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ హాదీతో పాటు పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అంతేకాక విద్యార్థులకు విదేశీ వీసాలు ఇప్పిస్తామని డబ్బు తీసుకున్నాడు. ఇలా పలువురి నుంచి రూ.1.12 కోట్లు వసూలు చేసి, కెనడా పరారయ్యాడు. అలీముద్దీన్‌ ఫారూకీకి అతడి కుమారుడు, రెండవ భార్య ఇక్కడి నుంచి సహకరిస్తున్నారు. పలుమార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బాధితులు సీసీఎస్‏లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


.........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

...........................................................................

Hyderabad: రేటింగ్‌ ఇచ్చి.. కామెంట్‌ పెడితే చాలు.. రూ.50 అంటూ రూ.2.49 లక్షలు దోచేశారు

హైదరాబాద్‌ సిటీ: ఇంటి వద్ద ఉంటూనే ప్రముఖ రెస్టారెంట్లకు రేటింగ్‌, మంచి కామెంట్లు ఇస్తే చాలు.. ఒక్కో టాస్క్‌కు రూ.50 ఇస్తామని నమ్మించిన కేటుగాళ్లు.. రూ. 2.49లక్షలు దోచేశారు. మోసపోయిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు(Cyber ​​crime police) ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన ప్రకారం.. బాఽధితునికి ఇటీవల వాట్సా్‌పలో ఒక ఇన్విటేషన్‌ వచ్చింది. 813-2024 డేటా డ్రైవ్‌లో డిజిటల్‌ అనే గ్రూపులో చేరండి, ఇంటి వద్ద ఉంటూనే ప్రముఖ రెస్టారెంట్లకు రేటింగ్‌ ఇచ్చి, కామెంట్స్‌ ఇస్తే చాలు ఒక్కో టాస్క్‌కు రూ. 50 చెల్లిస్తామని పేర్కొన్నారు.


నమ్మిన బాధితుడిని ‘టెలీగ్రామ్‌ గూగుల్‌ టాస్క్‌ గ్రూప్‌ 37సీ’ గ్రూపులో చేర్చారు. ప్రారంభంలో మూడు టాస్క్‌లు పూర్తి చేయడంతో రూ.150 ఇచ్చారు. ఆ తర్వాత బాధితున్ని వెల్ఫేర్‌ టాస్క్‌ అనే గ్రూపులో యాడ్‌ చేశారు. ఇది ఇంటర్నేషనల్‌ సంస్థ (చికాగో బోర్డు ఆప్షన్‌ ఎక్ఛెంజ్‌)కు చెందిన గ్రూపు అని నమ్మించారు. ఇక్కడ కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెడితే.. ఏ రోజుకు ఆరోజు మంచి లాభాలు వస్తాయని వాటిని ఎప్పటికప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చని నమ్మించారు. మొదటి రోజు 2000లు పెట్టుబడి పెట్టి, ఇచ్చిన టాస్క్‌ పూర్తి చేయగానే రూ.800 లాభం వచ్చినట్లు చూపించి, విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ ఇచ్చారు.


ఆ తర్వాత రూ.1500 లాభం విత్‌డ్రా చేసుకున్నాడు. అలా మెల్లమెల్లగా బాధితుడితో రూ. 2.49లక్షలు పెట్టుబడి పెట్టించారు. వాటి లాభాలను, అసలు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ తీసేశారు. ఇదేంటని నిలదీస్తే ఫైనల్‌ టాస్క్‌లు పూర్తి చేయాలని, ఇంకా పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 22 , 2024 | 01:30 PM

Advertising
Advertising
<