ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మ్యాట్రిమోనీ సైట్‌లో అమ్మాయిల నకిలీ వివరాలతో మోసం..

ABN, Publish Date - Aug 10 , 2024 | 09:43 AM

మ్యాట్రిమోనీ సైట్‌(Matrimony site)లో అమ్మాయిల ఫొటోలు, నకిలీ వివరాలుపెట్టి పలువురిని మోసం చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్‌ నేరస్థులను రాచకొం డ సైబర్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

- ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్‌ నేరస్థులు అరెస్టు

హైదరాబాద్: మ్యాట్రిమోనీ సైట్‌(Matrimony site)లో అమ్మాయిల ఫొటోలు, నకిలీ వివరాలుపెట్టి పలువురిని మోసం చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్‌ నేరస్థులను రాచకొం డ సైబర్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కాశీవిశ్వనాథ్‌(Inspector Kashivishwanath) తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ, సూర్యారావుపేట, లైట్‌హౌస్ కాలనీకి చెందిన షేర్‌మార్కెట్‌ ట్రేడర్‌ కోమలి సూర్యప్రకాష్‌(33) భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ, కొత్తగూడెంలో ఉంటున్నాడు. సూర్యారావుపేట శ్రీనివాసనగర్‌కు చెందిన సెట్టి సతీష్‌ (33) లారీలు, టిప్పర్ల ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్నాడు. సతీష్‌ మేనబావ సూర్యప్రకాష్‌.

ఇదికూడా చదవండి: BJP: 11 నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..


మోసపోయిన అనుభవంతో.. విలాసాలకు బానిసలై..

కోమలి సూర్యప్రకాష్‌ గతంలో మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ వివరాలకు ఆకర్షితుడై మోసపోయాడు. ఆ అనుభవంతో తనే మ్యాట్రిమోనీ సైట్‌లో గుర్తు తెలియని అమ్మాయిల ఫొటోలు, నకిలీ వివరాలతో అమాయకులను మోసం చేసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అతడు, మేనబావ సతీష్‌ పథకం ప్రకారం మ్యాట్రిమోనీ సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు.


వాయిస్‌ మార్చి అమ్మాయిలాగా మాట్లాడే ఫీచర్లతో..

ఓ ప్రత్యేక సెల్‌ఫోన్‌లో గల వాయిస్‌ మార్చి అమ్మాయిలాగా మాట్లాడే ఫీచర్లను ఉపయోగించారు. పలు మ్యాట్రిమోనియల్‌ సైట్స్‌లలో ఇంటర్నెట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకున్న అందమైన అమ్మాయిల ఫొటోలు పోస్టు చేసి నకిలీ పేర్లతో వారిద్దరూ రిజిస్టర్‌ చేసుకున్నారు. ప్ర పోజల్స్‌ పంపిన యువకులతో వాయిస్‌ మార్చి అమ్మాయిలా మాట్లాడుతూ ఆర్షించేవారు. తర్వాత అందమైన అమ్మాయిల ప్రొఫైల్‌ ఫొటో లు చూసిన యువకులు ఫోన్‌లో మాట్లాడేందు కు వెనుకాడేవారు కాదు, అలా అమ్మాయిల్లా ఫోన్‌ సంభాషణలు కొనసాగిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు ఫొటోలు వాట్స్‌పలో షేర్‌ చేసుకొని బుట్టలో వేసుకునేవారు.


ఆ తర్వాత తల్లిదండ్రులకు అనారోగ్యమనీ, చదువులకు ఫీజు కట్టాలనీ డబ్బులు పంపాలనీ ఎమోషన ల్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవారు. ఇలా అ మాయకుల నుండి లక్షల్లో డబ్బు దోచుకున్నా రు. ఈ యేడాది రాచకొండ పరిధిలో వారి మాయ అమ్మాయిల మాటలకు మోసపోయి లక్షల్లో డబ్బు కోల్పోయిన బాధితుల ఫిర్యాదుల మేరకు సైబర్‌ పోలీసులు సాంకేతిక ఆధారాల తో నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులపై రాచకొండ పరిధిలో రెండు, రామగుండం ఎన్‌టీపీసీ పీఎస్‌, మహబూబ్‌నగర్‌ జడ్చెర్ల పీఎస్‌, సైబరాబాద్‌ పరిధిలో ఒక్కో కేసు నమోదయ్యాయి. వారి మాయలో పడి బాధితులు రూ. 33,68,216లు కోల్పోయినట్లు విచారణలో తేలింది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 10 , 2024 | 09:43 AM

Advertising
Advertising
<