Hyderabad: జల్సాలకు అలవాటుపడి.. చోరీల బాట ఎంచుకుని..
ABN, Publish Date - Jul 09 , 2024 | 11:31 AM
జల్సాలకు అలవాటు పడి, సులువుగా సొమ్ము సంపాదించడం కోసం ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను మీర్‌పేట్ పోలీసులు(Meerpet Police) అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
- తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్టు
- వారిలో ఒకడు బాల నేరస్థుడు
- రూ.12లక్షల సొత్తు స్వాధీనం
హైదరాబాద్: జల్సాలకు అలవాటు పడి, సులువుగా సొమ్ము సంపాదించడం కోసం ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను మీర్‌పేట్ పోలీసులు(Meerpet Police) అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకడు మైనర్(బాల నేరస్థుడు) కావడం గమనార్హం! దీనికి సంబంధించిన వివరాలను సోమవారం మీర్‌పేట్ పీఎస్‌లో ఇన్‌స్పెక్టర్ నాగరాజుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి వెల్లడించారు. జనగామ జిల్లా, రఘునాథ్‌పల్లి మండలం బానాజీపేట్‌కు చెందిన వల్లెపు జితేందర్ అలియాస్ జిత్తు(20) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని పీర్జాదిగూడలో నివసిస్తూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: వామ్మో.. పూరీలో పురుగు..
మహబూబ్‌బాద్ జిల్లాలోని బీటీనగర్‌కు చెందిన రాపోల్ చందు అలియాస్ కృష్ణ(21) ఉప్పల్‌లో ఉంటూ సెంట్రింగ్ పని చేస్తున్నాడు. వరంగల్ జిల్లా గూడూరుకు చెందిన రాపోల్ శ్రీశైలం అలియాస్ చిన్నా(34) ఉప్పల్‌లోని బీరప్పగడ్డలో నివసిస్తూ లేబర్ పని చేస్తున్నాడు. వీరు ముగ్గురితో పాటు మరో బాల నేరస్థుడు కలిసి జట్టుగా ఏర్పడి రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి సొత్తు చోరీ చేయడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు. జిత్తు, కృష్ణ, బాల నేరస్థుడిపై వనస్థలిపురం, మీర్‌పేట్, మేడిపల్లి పీఎస్‌లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. వారంతా పలుమార్లు జైలుకు సైతం వెళ్లి వచ్చారు. సదరు ముగ్గురు జైలు నుంచి(బాల నేరస్థుడు అబ్జర్వేషన్ హోమ్ నుంచి) బయటకు వచ్చిన తర్వాత రాపోల్ శ్రీశైలంను పరిచయం చేసుకుని మళ్లీ చోరీలు మొదలుపెట్టారు.
ఈ క్రమంలో ఇటీవల బడంగ్‌పేట్ మారుతీనగర్‌కు చెందిన రమేశ్ ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన మీర్‌పేట్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు జరిపి నలుగురు నిందితులను సోమవారం హయత్‌నగర్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారి నుంచి 125 గ్రాముల బంగారు నగలు, 450 గ్రాముల వెండి వస్తువులు, ఒక ద్విచ క్రవాహనం, ఒక ఇనుప రాడ్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తు విలువ రూ.12లక్ష లు ఉంటుందని ఏసీపీ కాశీరెడ్డి చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 09 , 2024 | 11:31 AM