Hyderabad: రూ.16లక్షల విలువ గల హాష్ ఆయిల్ పట్టివేత
ABN, Publish Date - Nov 14 , 2024 | 08:18 AM
ఎల్బీనగర్(LB Nagar)లో లా అండ్ ఆర్డర్ పోలీసులు, యాంటీ నార్కోటిక్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో రూ.16 లక్షల విలువ చేసే 3కేజీల 319గ్రాముల హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు. ఈ నార్కోటిక్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మావోయిస్టు సహా ఇద్దరు డ్రగ్ పెడ్లర్‌లను అరెస్టు చేశారు.
- మాజీ మావోయిస్టు సహా ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు అరెస్టు
- పరారీలో మరో ముగ్గురు
హైదరాబాద్: ఎల్బీనగర్(LB Nagar)లో లా అండ్ ఆర్డర్ పోలీసులు, యాంటీ నార్కోటిక్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో రూ.16 లక్షల విలువ చేసే 3కేజీల 319గ్రాముల హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు. ఈ నార్కోటిక్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మావోయిస్టు సహా ఇద్దరు డ్రగ్ పెడ్లర్‌లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంట్ కట్.. కారణం ఏంటంటే..
ఎల్బీనగర్ ఎస్‌హెచ్‌ఓ వినోద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం రావులపల్లి జమదంగికి చెందిన వంతల నారాయణ(24), వంతల రమేష్(19), అర్జున్(19) స్నేహితులు. సులభంగా డబ్బు సంపాదించాలని ముగ్గురూ డ్రగ్ పెడ్లర్లుగా మారారు. విశాఖపట్నం(Visakhapatnam) జమదంగికి చెందిన శివ, కొండమల్లుకు చెందిన కిషోర్‌ల వద్ద వారు 3 కేజీల 319గ్రాముల హాష్ ఆయిల్‌ను ప్లాస్టిక్ కవర్స్‌లో తీసుకుని మంగళవారం ఎల్బీనగర్‌కు వచ్చారు.
రాహుల్ అనే వ్యక్తికి అందజేసేందుకు నార్సింగ్ మాల్, మాల్‌మైసమ్మ ఫ్లైఓవర్ వద్ద ముగ్గురూ స్టూడెంట్ బ్యాక్‌ప్యాక్ బ్యాగులతో వేచి ఉన్నారు. విషయం తెలుసుకున్న యాంటీ నార్కోటిక్ పోలీసులు, లాఅండ్ ఆర్డర్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం మూడు హాష్ ఆయిల్ ఉన్న ప్లాస్టిక్ బ్యాగులను, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నేరం అంగీకరించడంతో ముగ్గురిని బుధవారం రిమాండుకు తరలించారు.
ప్రధాన నిందితుడు మాజీ మావోయిస్టు
ప్రధాన నిందితుడు వంతల నారాయణ అలియాస్ సిద్దు మాజీ మావోయిస్టు. 2015లో అతడు విశాఖపట్నం పెదబాయలు మావోయిస్టు దళంలో సహాయకుడి గా చేరాడు. 2020వరకు అతడు మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 2021లో అతడు మావోయిస్టు స్నేహితులు విష్ణు, శ్రీనులతో కలిసి విశాఖపట్నం డీఎస్పీ ఎదుట లొంగిపోయాడు. అతడిపై 10 కేసులు ఉన్నట్లు సమాచారం.
ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్ నుంచే రేవంత్ భరతం పడతాం
ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం
ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 14 , 2024 | 08:18 AM