ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రెండో అంతస్తు నుంచి అమ్మమ్మను తోసేశాడు..

ABN, Publish Date - Oct 22 , 2024 | 08:00 AM

రూ.50 విషయమై కుటుంబంలో తలెత్తిన వివాదం.. ఓ వృద్ధురాలి ప్రాణాలను తీసింది. కోపంలో అమ్మమ్మను కుర్చీతో సహా రెండో అంతస్తు నుంచి కిందికి తోసేయడంతో ఆమె మృతి చెందింది. గాంధీనగర్‌ సీఐ రాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌(Warangal) జిల్లా నేరేడు గ్రామానికి చెందిన కొత్త సుశీలమ్మ (85) ఇద్దరు కుమార్తెలు కళావతి, మంగమ్మలతో కలిసి కవాడిగూడలోని ఉన్నికోటలో నివాసం ఉంటున్నారు.

- రెండు కాళ్లు, చేయి విరిగి అక్కడికక్కడే మృతి

- రూ.50 వివాదంలో ఘాతుకం.. తల్లి ఫిర్యాదుతో హత్య కేసు

హైదరాబాద్: రూ.50 విషయమై కుటుంబంలో తలెత్తిన వివాదం.. ఓ వృద్ధురాలి ప్రాణాలను తీసింది. కోపంలో అమ్మమ్మను కుర్చీతో సహా రెండో అంతస్తు నుంచి కిందికి తోసేయడంతో ఆమె మృతి చెందింది. గాంధీనగర్‌ సీఐ రాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌(Warangal) జిల్లా నేరేడు గ్రామానికి చెందిన కొత్త సుశీలమ్మ (85) ఇద్దరు కుమార్తెలు కళావతి, మంగమ్మలతో కలిసి కవాడిగూడలోని ఉన్నికోటలో నివాసం ఉంటున్నారు. ఆమె కుమారుడు వెంకన్న సొంతూరు నేరేడు గ్రామంలోనే ఉంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 24న నగరానికి కృష్ణాజలాలు బంద్‌..


సుశీలమ్మ(Sushilamma) కుమార్తె కళావతికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నితిన్‌ (30), చిన్న కుమారుడు గోపి (28), వీరితో పాటు మరో కుమార్తె మంగమ్మ కుమారులు కూడా ఇక్కడే ఉంటున్నారు. సెక్యూరిటీ గార్డు(Security guard)గా విధులు నిర్వహిస్తున్న నితిన్‌ (30) తాను డ్యూటీకి వెళ్లాలని, అందుకోసం రూ.50 ఇవ్వాలని లేకపోతే కార్యాలయం వద్ద డ్రాప్‌ చేయాలని కుటుంబసభ్యులను సోమవారం సాయంత్రం కోరాడు. దీనిపై కుటుంబంలో గొడవ జరిగింది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా గోపీ బయటకు వెళ్లిపోవడంతో నితిన్‌ ఆగ్రహించాడు.


ఆ కోపంలో అమ్మమ్మ సుశీలను కుర్చీతో సహా రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. ఎడమ చేయి, రెండు కాళ్లు విరిగి అక్కడికక్కడే మృతిచెందింది. గాంధీనగర్‌ సీఐ రాజు, ఎస్‌ఐ నయూమ్‌ఖాన్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీంను రప్పించి సుశీల హత్యకు గల కారణాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కళావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమారుడు నితీష్‏పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాంధీనగర్‌ పోలీసులు నితీష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: Thummala: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2024 | 08:00 AM