Hyderabad: ఇస్త్రీపెట్టెతో కొట్టి.. మెడకు వైరు బిగించి..
ABN, Publish Date - Sep 05 , 2024 | 10:09 AM
నిండు నూరేళ్లు కలిసి ఉండాల్సిన కాపురంలో మనస్పర్థలు చిచ్చురేపాయి. తరచూ ఘర్షణ, కొట్లాటతో విసిగిపోయిన ఆ ఇల్లాలు కుమారుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. ఈ ఘటన బుధవారం ఉదయం అల్లాపూర్ పోలీసుస్టేషన్(Allapur Police Station) పరిధిలో వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
- వేధింపులు తాళలేక కొడుకుతో కలిసి భర్తను అంతమొందించిన భార్య
హైదరాబాద్: నిండు నూరేళ్లు కలిసి ఉండాల్సిన కాపురంలో మనస్పర్థలు చిచ్చురేపాయి. తరచూ ఘర్షణ, కొట్లాటతో విసిగిపోయిన ఆ ఇల్లాలు కుమారుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. ఈ ఘటన బుధవారం ఉదయం అల్లాపూర్ పోలీసుస్టేషన్(Allapur Police Station) పరిధిలో వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్(Karimnagar)కు చెందిన వడ్యానం పరమేశ్వర్ (40), భారతి (35) భార్యాభర్తలు. 15 ఏళ్ల కిత్రం వీరికి వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు.
ఇదికూడా చదవండి: TG News: రూ.12 లక్ష విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టివేత..
కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న పరమేశ్వర్(Parameshwar) కుటుంబంతో కలిసి పర్వత్‌నగర్‌లో కిరాయికి ఉంటున్నాడు. మనస్ఫర్ధలతో కొద్దినెలలుగా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈనెల 1న రాత్రి ఇద్దరూ గొడవపడి కొట్టుకున్నారు. వేధింపుల నుంచి ఎలాగైనా బయటపడాలని భావించిన భారతి.. భర్తను అంతమొందించాలని నిర్ణయించుకంది. కొడుకు సాయంతో ఇస్త్రీపెట్టెతో పలుమార్లు భర్తను తీవ్రంగా కొట్టడంతోపాటు వైరును మెడకు బిగించి హతమార్చింది.
ఈ ఘటనను కూతురు చూసిందని గ్రహించిన ఆమె వెంటనే పరమేశ్వర్‌ను మాదాపూర్(Madapur)లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. విషయం బంధువులకు తెలియడంతో భారతి కొడుకుతో సహా పారిపోయింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలు భారతి, బాలుడి(మైనర్)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
.............................................................
ఈ వార్తను కూడా చదవండి:
..............................................................
MP Eatala: పేదల ఇళ్లు కూలగొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా..
- ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఎంపీగా చూస్తూ ఊరుకోవాలా అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etala Rajender) అధికారులను ప్రశ్నించారు. బుధవారం ఆయన సరూర్‌నగర్ చెరువును బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదరాయుడు చెరువు 17 ఎకరాలని 1968లో నిర్ణయించి పక్కన ఉన్న భూములను లేఅవుట్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని ఇప్పుడు ఆ చెరువు 42 ఎకరాలు అని నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. ఇళ్లకే కాదు దేవాలయాలకు, శ్మశానవాటికలకు, కమ్యూనిటీహాళ్లకు కూడా నోటీసులు అంటించారన్నారు. ఆనాటి అధికారులు అనుమతులు ఇస్తేనే ఇళ్లు కట్టుకున్నామని ఇక్కడి ప్రజలు చెప్తున్నారని ఆయన తెలిపారు.
పీఆండ్‌టీ కాలనీలో గజం మూడు రూపాయల చొప్పున ప్రజలు కొనుక్కున్నారని అప్పటి భూములకు ఇప్పుడు నోటీసులు ఇస్తామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ‘మీరు నిచ్చింతగా ఉండండి మీ వెంట నేను ఉంటాను’అని సరూర్‌నగర్(Sarurnagar) చెరువు పరిసర ప్రాంతాల వాసులకు ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. ఈటల వెంట బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, చంపాపేట కార్పొరేటర్ వంగా మధుసూదన్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సిల్వేరి అనీల్‌కుమార్, ఆకుల అఖిల్, ప్రవీణ్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, అమిత్ సుమిత్, శ్రీనివా్‌సలతో పాటు గ్రీన్‌పార్క్‌కాలనీ ప్రతినిధులు బాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Sep 05 , 2024 | 10:09 AM