Hyderabad: ‘మూసీ’లో ఇల్లు పోతుందనే మనోవ్యధతో గుండెపోటు
ABN, Publish Date - Dec 13 , 2024 | 07:43 AM
మూసీ అభివృద్ధి పనుల్లో తన ఇల్లు ఎప్పుడైనా కూలిపోవచ్చన్న మనోవ్యధ ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసింది. పైసాపైసా కూడబెట్టి చేసి కట్టుకున్న ఇల్లు ఎప్పుడు పోతుందో తెలియడం లేదంటూ ఇంట్లో నుంచి వెళ్లిన అతడు ఆటో నడుపుతూనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
- ఆటో నడుపుతూ కుప్పకూలిపోయిన డ్రైవర్
హైదరాబాద్: మూసీ అభివృద్ధి పనుల్లో తన ఇల్లు ఎప్పుడైనా కూలిపోవచ్చన్న మనోవ్యధ ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసింది. పైసాపైసా కూడబెట్టి చేసి కట్టుకున్న ఇల్లు ఎప్పుడు పోతుందో తెలియడం లేదంటూ ఇంట్లో నుంచి వెళ్లిన అతడు ఆటో నడుపుతూనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో నడుపుకుంటూ జీవిస్తున్న రవీందర్(55)కు భార్య, ముగ్గురు సంతానం. విద్యార్థులను ఆటోలో స్కూల్‌లో దింపుతూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: CP CV Anand: ఆ కార్యక్రమాల నిర్వహణకు 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలి
ఇటీవల ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేశాడు. కొడుకు బాబు(17) ఇంటర్ చదువుతున్నాడు. 20 సంవత్సరాల క్రితం పైసా పైసా కూడబెట్టి రామంతాపూర్ భగాయత్ కేటీఆర్ నగర్‌లో 60 గజాల స్థలం కొని రేకుల గది నిర్మించుకున్నాడు. ప్రభుత్వం మూసీ నది(Musi River)కి పక్కనే ఉన్న ఇళ్లను తొలగిస్తామంటూ మార్కింగ్ చేయడంతో మనోవ్యధకు గురయ్యాడు. మార్కింగ్‌లో తన ఇల్లు కూడా ఉండడంతో నాలుగు నెలలుగా బాధ పడని రోజు లేదు.
ఆటో నడిపితే వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడం లేదని,ఇల్లు కూల్చివేస్తే బతుకు సాగేదెట్లా అంటూ బాధపడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఎప్పటిలాగే నాగోల్‌లోని విద్యార్థులను స్కూల్‌లో దింపేందుకు గురువారం ఉదయం ఆటో తీసుకొని బయలుదేరాడు. ఎంతో మనోవ్యధతో వెళ్లినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల్లోపే మొదటి ట్రిప్‌లో విద్యార్థులను దించి తిరిగి రెండో ట్రిప్‌లో ఇద్దరు విద్యార్థులను నాగోల్‌లోని ఓ కాలనీలో ఆటోలో ఎక్కించుకున్నాడు.
మెయిన్ రోడ్డు ఎక్కి ఉప్పల్‌వైపు వస్తుండగా మూసీ సమీపంలోకి వచ్చేసరికి అకస్మాత్తుగా ఆటోను రోడ్డు పక్కకు ఆపి స్టీరింగ్‌పై ఒరిగిపోయాడు. ఆటోలోని విద్యార్థులు ఎంత పిలిచినా లేకవపోవడంతో వారు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి 108లో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?
ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్
ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా
Read Latest Telangana News and National News
Updated Date - Dec 13 , 2024 | 07:43 AM