ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ప్రాణాలు తీసిన అతివేగం.. అసలేం జరిగిందంటే..

ABN, Publish Date - Aug 13 , 2024 | 09:37 AM

అతివేగంగా వెళ్తున్న ఓ బైక్‌ అదుపు తప్పి డివైడర్‌(Divider)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన బండ్లగూడ పోలీస్‏స్టేషన్‌(Bandlaguda Police Station) పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.

- డివైడర్‌ను ఢీ కొట్టిన బైక్‌

- ముగ్గురి మృతి

హైదరాబాద్: అతివేగంగా వెళ్తున్న ఓ బైక్‌ అదుపు తప్పి డివైడర్‌(Divider)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన బండ్లగూడ పోలీస్‏స్టేషన్‌(Bandlaguda Police Station) పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌ శంకేశ్వర్‌ బజార్‌(Saidabad Shankeshwar Bazar)కు చెందిన బ్యాగరి శ్రీహరి(48) వంటమనిషి. అదే ప్రాంతానికి చెందిన సందీప్‌(20), అభిలాష్(20)లు స్నేహితులు. వీరు ముగ్గురు సైదాబాద్‌లో బంధువుల ఇంట్లో జరిగే బోనాల పండుగకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున అభిలాష్‏ను మైలార్‌దేవ్‌పల్లిలో వదిలిపెట్టడానికి బైక్‌ (టీఎస్‌ 11 ఎఫ్‌ఏ 3972)పై బయలుదేరారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఆ అన్నదమ్ములు.. స్మగ్లర్లు


3.45గంటల సమయంలో చాంద్రాయణగుట్ట(Chandrayanagutta) చౌరస్తా దాటిన తర్వాత హషామాబాద్‌ షాదాబ్‌ హోటల్‌ ఎదురుగా ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న బైక్‌ అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ముగ్గురు 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. సందీప్‌, అభిలాష్‏లకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాలపాలైన శ్రీహరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే అతను మృతిచెందాడు. వర్షం కురుస్తుండడంతో బైక్‌ అదుపు తప్పినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


............................................................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................................

ఆ అన్నదమ్ములు.. స్మగ్లర్లు

- ఏవోబీ నుంచి బెంగళూరుకు హాష్‌ ఆయిల్‌ సరఫరా

- నిఘా పెట్టి పట్టుకున్న రాచకొండ పోలీసులు

- 13.5ల కేజీల హాష్‌ ఆయిల్‌ పట్టివేత

- బహిరంగ మార్కెట్లో రూ. 14 కోట్ల విలువ

హైదరాబాద్‌ సిటీ: ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్‌) నుంచి బెంగళూరుకు హాష్‌ ఆయిల్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 13.5 కేజీల హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.14కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ సుధీర్‌బాబు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.


విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం అలగామ్‌ ప్రాంతానికి చెందిన వంచుర్బ కొండబాబు వ్యవసాయం చేస్తుంటాడు. అతను తరచుగా అల్లూరి సీతారామరాజు జిల్లా అన్నవరం పశువుల సంతకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఏవోబీకి చెందిన వ్యక్తి అతడికి పరిచయం అయ్యాడు. అతనికి గంజాయి, హాష్‌ ఆయిల్‌ స్మగ్లింగ్‌ వల్ల వచ్చే అధిక ఆదాయం గురించి కొండబాబుకు చెప్పాడు. మంచి అవకాశంగా భావించిన కొండబాబు అన్నవరంలోనే ఉంటున్న తమ్ముడు బాలకృష్ణకు విషయం చెప్పాడు. అప్పటికే బాలకృష్ణకు స్మగ్లింగ్‌లో అనుభవం ఉండటంతో ఇద్దరూ

కలిసి హాష్‌ ఆయిల్‌ను స్మగ్లింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏవోబీకి చెందిన వ్యక్తి సహాయంతో ఏవోబీ నుంచి బెంగళూరుకు సరుకు రవాణా చేస్తున్నారు. ఏవోబీలో తక్కువ ధరకు హాష్‌ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్న స్మగ్లర్స్‌ బహిరంగ మార్కెట్లో పదిరెట్లు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.


బస్సులో సరఫరా..

అన్నదమ్ములు ఇద్దరూ కాలేజీ కుర్రాళ్ల మాదిరి గా తయారై బ్యాగులో హాష్‌ ఆయిల్‌ను కేజీ చొప్పున ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేసుకొని, బస్సులో ప్రయాణించేవారు. బెంగళూరు నుంచి రిసీవర్‌ వచ్చి పలానా చోట ఉన్నట్లు సమాచారం ఇస్తాడు. దాంతో అన్నదమ్ములిద్దరూ బస్సు దిగి రిసీవర్‌ ఉన్న ప్రాంతానికి వెళ్లి సరుకును అందజేసి వెళ్లిపోతారు. కొంతకాలంగా హాష్‌ ఆయిల్‌ను వయా హైదరాబాద్‌ వయా బెంగళూరుకు బస్సులో వెళ్లి సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఒడిశా బోర్డర్‌ నుంచి 13.5 కేజీల హాష్‌ ఆయిల్‌తో బయల్దేరిన అన్నదమ్ములు పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ సమీపంలో బస్సు దిగారు.


అక్కడి నుంచి తాజా ఫుడ్స్‌ హోటల్‌కు చేరుకొని బెంగళూరు నుంచి వచ్చే రిసీవర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పటికే రెక్కీచేసిన ఎస్‌వోటీ పోలీసులు, హయత్‌నగర్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు దాడిచేసి వారిని పట్టుకున్నారు. వారి నుంచి హాష్‌ ఆయిల్‌, రూ.2000 నగదు, రెండు ఫోన్లు, ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌ కవర్‌ స్వాధీనం చేసుకున్నారు. సీజ్‌ చేసిన హాష్‌ ఆయిల్‌ విలువ బహిరంగ మార్కెట్లో రూ.14 కోట్లు ఉంటుందని సీపీ వెల్లడించారు. కాగా, కేజీ హాష్‌ ఆయిల్‌ను తయారు చేయడానికి 35 నుంచి 40 కేజీల గంజాయిని మరపట్టాల్సి ఉంటుంది. అలా పోలీసులు స్వాధీనం చేసుకున్న 13.5 కేజీల హాష్‌ ఆయిల్‌ను తయారు చేయడానికి సుమారు 560 కేజీల గంజాయిని వినియోగించినట్లు సీపీ తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2024 | 09:37 AM

Advertising
Advertising
<